KARNISENA BAJRANG DAL DEMAND REMOVAL OF JAWED HABIB BOARDS IN FRONT OF SALONS SNR
జావెద్ ఓవర్ యాక్షన్‌కి గట్టి రియాక్షన్..ఇప్పట్లో వదిలేలా లేరు
Photo Credit:Youtube
Jawed Issue: మహిళ తలపై ఉమ్మివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు కర్ణిసేన, భజరంగ్‌దళ్ సభ్యులు. కరోనా నేపధ్యంలో పబ్లిక్‌గా తలపై ఉమ్మివేసిన నేరానికి జావెద్ హబీబ్ సెలూన్ల ముందు బోర్డులు తొలగించాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. బోర్డులు తొలగించకపోతే సరైన గుణపాఠం చెబుతామంటున్నారు.
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో హెయిర్ కటింగ్ ట్రైనింగ్ సమినార్లో జావెద్ హబీబ్ ప్రవర్తించిన తీరు తెగ వైరల్ అయింది. కానీ ఆ వీడియోలో ఓ మహిళ తలపై ఉమ్మివేయడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. జావెద్ క్షమాపణ చెప్పినప్పటికి.. వాళ్లలో ఆగ్రహజ్వాలలు మాత్రం చల్లారడం లేదు. సెమినార్ (Seminar)పేరుతో ఇంత నీచంగా ప్రవర్తించడం సరైన పద్దతేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే మొన్న మధ్యప్రదేశ్(Madhya pradesh)లోని fడోర్(Indore)లో కర్ణిసేన(Karni sena)ఆగ్రహం వ్యక్తం చేసింది. జావెద్ హబీబ్(Jawed habib)కి చెందిన ఏ హెయిల్ సెలున్(Salons)లను రాష్ట్రంలో ఉంచడానికి వీల్లేదంటూ ఓ బ్రాంచ్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కర్ణిసేన సభ్యులు. దీనికి కొనసాగింపుగానే జావెద్ ప్రవర్తించిన తీరును ఖండిస్తూ నిన్న చత్తీస్‌గఢ్(Chattisgarh)దుర్గ్(Durg)లో భజరంగ్‌దళ్ (Bajrang dal)పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. భజరంగ్ దళ్ సభ్యులు దుర్గ్‌లోని జావెద్ హబీబ్ సెలున్ బోర్డును తొలగించే వరకూ అక్కడి నుంచి కదల్లేదు. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏ సెలున్ ముందు జావెద్ హబీబ్ పేరు కనిపించడానికి వీల్లేదని హెచ్చరించారు భజరంగ్‌దళ్ సభ్యులు. కోవిడ్ ఆంక్షలు (Covid rules)అమలవుతున్న వేళ బహిరంగంగా ఉమ్మివేయడం శిక్షార్హమైన నేరమని జాతీయ మహిళా కమిషన్(National women commission)పేర్కొంది.ఈ కారణంతో జావెద్ హబీబ్‌పై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ పోలీసులకు లేఖ కూడా రాసింది.
అతని చర్యలపై ఆగని నిరసనలు..
హెయిర్‌స్టైలిస్ట్ జావేద్ హబీబ్ ఇండియాలోని 115 నగరాల్లో 850 కంటే ఎక్కువ సెలూన్లు, 65 హెయిర్ అకాడమీలను నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార సంస్థలకు ఉన్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈవిధంగా ప్రవర్తించారని నెటిజన్లు ,సెలూన్ షాప్ నిర్వాహకులు మండిపడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ లేఖతో యూపీలో చాలా చోట్ల జావెద్‌పై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఒక్క సెమినార్‌తో దెబ్బతిన్న పేరు, ప్రతిష్ట..
సెమినార్లో అందరూ శ్రద్ధగా ఆలకించాలని, అక్కడికి వచ్చిన వందలాది మందిని వినోద పరచాలని చేశాను తప్ప ఉద్దేశ్వపూర్వకంగా ఉమ్మి వేయలేదన్నారు జావెద్. ఆయన రిప్లై ఇచ్చినప్పటికి అతని తీరుపై ఆగ్రహజ్వాలలు మాత్రం చల్లారడం లేదు. ఈ పరిస్థితి వల్ల రాబోయే రోజుల్లో జావెద్ హబీబ్ పేరుతో కొనసాగుతున్న వందలాది సెలున్లు, హెయిర్ అకాడమీలకు ఆదరణ తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు.తనకున్న బ్రాండ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొనే జావెద్ ఇలా చేశారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. జావెద్ హబీబ్ సెలున్లను మూసివేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.