మన సమాజంలో రాజకీయ నాయకులకు ఎంత గుర్తింపు ఉంటుందో కలెక్టర్లకూ అంతే గుర్తింపు ఉంటుంది. బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన ఈ పదవిలో కలెక్టర్లు మన సొసైటీ నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. ఇలా కలెక్టర్లు అయిన వారిలో చాలా మంది దేశానికి ఎనలేని సేవ చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే... కలెక్టర్లలో తలబిరుసు తనంతో ప్రవర్తించే వారూ ఉంటారు. ఏ పని చెయ్యాలన్నా... నేనేంటి... నే స్థాయేంటి... అది చెయ్యడమేంటి అంటూ రివర్స్ అవుతుంటారు. అలాంటిది... ఆ కలెక్టర్ మాత్రం... పదవిని పక్కన పెట్టి సామాన్యురాలు అయిపోయారు. తన కారు టైరును తానే మార్చుకున్నారు. అందుకే అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు.
ఈ ఘటన జరిగింది కర్ణాటకలో. అక్కడి మైసూరు జిల్లా కలెక్టర్‌గా చేస్తున్నారు రోహిణి సింధూరి. తెలుగు మహిళ అయిన ఆమె... వారం కిందట... కొడగు ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు చూసేందుకు కారులో వెళ్లారు. తనే స్వయంగా కారును డ్రైవ్ చేశారు. మధ్యలో కారు టైరుకు పంక్చర్ అయ్యింది. అలాంటప్పుడు ఆమె కలెక్టర్ కాబట్టి... ఓ ఫోన్ కొడితే... మరో కారు వచ్చేస్తుంది. అందులో హాయిగా వెళ్లిపోవచ్చు. కానీ ఆమె అలా చెయ్యలేదు. అది అధికారిక పర్యటన కాదు కాబట్టి... తన సొంత పని కాబట్టి... తానే స్వయంగా కారు కింద జాకీ సెట్ చేసి... పంక్చర్ అయిన టైరును ఊడదీసి... మరో టైరును సెట్ చేసుకున్నారు.
ఇది చూసిన వారు... ఆమెను గుర్తు పట్టారు. "మీరు మైసూర్ జిల్లా కలెక్టర్ కదా" అని అడిగితే... ఆమె చక్కగా నవ్వేశారు. "అవును నేనే రోహిణి సింధూరిని" అని చెప్పారు. అంతే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. "ఏంటీ ఓ కలెక్టర్ స్వయంగా కారు టైరు మార్చుకుంటున్నారా... దేశంలో ఎక్కడైనా చూశామా" అనుకుంటూ... ఆమెను వీడియో తీసి... సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది.
A video of Mysuru DC Rohini Sindhuri operating a jack with a spanner to replace a punctured tyre #rohinisindhuri pic.twitter.com/UWmni9XOzh
— tiktokbeauties (@tiktokbeauties) February 27, 2021
ఇది కూడా చదవండి: Bird Nest: టమాటా సాస్ జార్‌లతో పక్షులకు గూళ్లు... ఫొటోలు చూడండి
కలెక్టర్ రోహిణి సింధూరి తీరు అందరికీ నచ్చుతోంది. పదవుల్ని అడ్డం పెట్టుకొని... అడ్డగోలుగా అవినీతికి పాల్పడేవారు మన దేశంలో లెక్కలేనంత మంది. ఆమె మాత్రం... నిజాయితీగా వ్యవహరించారని అంతా మెచ్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: VIRAL NEWS, Viral Videos