PUBG | పబ్‌జీలో పిచ్చి... మురుగు కాలువలో ఈత

చెత్తా చెదారంతో నిండిపోయి, మురుగు కంపు కొడుతున్న కాలువలో ఓ యువకుడు ఈత కొడుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

news18-telugu
Updated: September 19, 2019, 7:26 PM IST
PUBG | పబ్‌జీలో పిచ్చి... మురుగు కాలువలో ఈత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడు మురుగుకాలువలో ఈత కొడుతున్నారు. ఆ యువకుడిని చూసిన వారంతా ‘వీడికేమైనా పిచ్చా’ అనుకున్నారు. కానీ, అది మామూలు పిచ్చి కాదు. పబ్ జీ పిచ్చి అని తర్వాత తెలిసింది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని విజయనగరలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. చెత్తా చెదారంతో నిండిపోయి, మురుగు కంపు కొడుతున్న కాలువలో ఓ యువకుడు ఈత కొడుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, అక్కడే ఉన్న స్నేహితులను అడిగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్స్‌తో పందెం కట్టిన యువకుడు పబ్ జీ గేమ్‌లో ఓడిపోయాడు. దీంతో పందెం ప్రకారం డ్రైనేజీలో దిగి ఈత కొట్టడం మొదలుపెట్టాడు. పబ్ జీ వల్ల ఇలాంటి అనర్థాలు ఎన్నో జరుగుతున్నాయంటూ కర్ణాటక బెళగావి సంస్థ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేశారు. పబ్ జీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading