హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: ఇదిగో నా భర్త.. చనిపోయి పాములా పుట్టాడు.. సర్పంతో సహజీవనం చేస్తున్న మహిళ

Viral News: ఇదిగో నా భర్త.. చనిపోయి పాములా పుట్టాడు.. సర్పంతో సహజీవనం చేస్తున్న మహిళ

పాముతో మహిళ

పాముతో మహిళ

Viral News: ఇంటికొచ్చిన పామును ఓ మహిళ తన భర్తలా భావించింది. చనిపోయిన భర్త పాము రూపంలో పుట్టాడని నమ్ముతోంది. ఈ విచిత్ర ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.

  పాము అంటే మనలో చాలా మందికి భయం వేస్తుంది. ఆ పేరు వింటేనే.. ఎక్కడ లేని వణుకు పుట్టుకొస్తోంది. ఇక పొరపాటున.. ఎక్కడైనా కనిపించిందా... అంతే ఒళ్లు జలదరిస్తుంది. భయంతో ముచ్చెమటలు పడతాయి. ప్రాణ భయంతో పరుగులు పెడతాం కూడా..! కానీ ఓ మహిళ మాత్రం పాముతోనే కలిసి జీవిస్తోంది. పాములో తన భర్తను చూసుకుంటూ.. అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మరణించిన తన భర్త.. పాము  (Snake viral video) రూపంలో మరో జన్మ ఎత్తి.. తనను కలిసేందుకు వచ్చాడని చెబుతోంది. ఆమె చెప్పే మాటలు విని.. చుట్టు పక్కలే వారికి దిమ్మ తిరిగింది. కర్నాటకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.

  వయాగ్రా వేసుకున్న కొత్త పెళ్లికొడుకు.. 20 రోజుల పాటు అలాగే.. భార్యకు నరకం.. ఇక ఎప్పటికీ అ

  కర్ణాటక (Karnataka) లోని బాగల్‌కోట్ (Bagalkot Snake) జిల్లా బనహట్టి తాలుకా కులహళ్లి గ్రామంలో శారవ్వ కంబార అనే మహిళ నివసిస్తోంది. వయసు 50-55 ఏళ్ల మధ్య ఉంటుంది. రెండేళ్ల క్రితమే ఆమె భర్త మోనేష్ అనారోగ్య సమస్యలతో మరణించాడు. అప్పటి నుంచీ ఆమె ఒక్కరే ఒంటరిగా నివసిస్తోంది. ఐతే ఐదు రోజుల క్రితం శారవ్వ ఇంటికి ఓ పాము వచ్చింది. పామును చూసి శారవ మొదల భయటపడిపోయింది. కానీ పాము ఎలాంటి హాని తలపెట్టకుండా.. చాపపైనే కూర్చుంది. తనవైపే చూస్తుండడంతో శారవ్వ కూడా ఆశ్చర్యపోయింది. ఐతే మరణించిన తన భర్త పునర్జన్మ ఎత్తాడని.. పాము రూపంలో తమ ఇంటికి తిరిగి వచ్చాడని భావించింది. అప్పటి నుంచి ఆ పామును పెంచుకుంటోంది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పలేదు. దాని ఆలనా పాలనా చూసుకోవడమే కాదు.. కబుర్లు కూడా చెబుతోంది.

  ఇటీవల పక్కింటి మహిళ శారవ్వ ఇంటికి వచ్చింది. ఇంట్లో చాపపై ఉన్న పామును చూసి భయడిపోయింది. 'శారవ్వా.. పాము.. పాము'.. అని కేకలు వేసింది. 'భయపడకు.. అదీ ఏమీ చేయలేద'ని చెప్పింది శారవ్వ. ఆ తర్వాత స్టోరీ మొత్తం చెప్పింది. చనిపోయిన తన భర్తే పాము రూపంలో వచ్చాడని చెప్పడంతో.. ఆ పక్కింటి మహిళ అవాక్కయింది. అవునా..అలాగా.. అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. శారవ్వ మాటలను నమ్మని ఆమె.. చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని చెప్పింది. చివరకు ఫారెస్ట్ అధికారుల వరకూ వెళ్లింది. వారు గ్రామానికి చేరుకొని పామును పట్టుకున్నారు. ఐతే ఆ పాను తన భర్త అని.. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టవదని శారవ్వ చెప్పింది. అవన్నీ మూడఢనమ్మకాలను శారవ్వకు నచ్చచెప్పారు అటవీశాఖ సిబ్బంది. అనంతరం పామును సంచిలో తీసుకెళ్లి.. అడవిలో వదిలిపెట్టారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Karnataka, Snake, Trending, Viral Video

  ఉత్తమ కథలు