హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Road Named After Godse: కర్ణాటకలో మరో వివాదం..కొత్త రోడ్డుకు గాడ్సే పేరు!

Road Named After Godse: కర్ణాటకలో మరో వివాదం..కొత్త రోడ్డుకు గాడ్సే పేరు!

కొత్త రోడ్డుకు గాడ్సే పేరు

కొత్త రోడ్డుకు గాడ్సే పేరు

Godse Road In Karnataka: భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన గాంధీ(Gandhi)ని "మహాత్మా"అని గౌరవిస్తున్నాం. మన కరెన్సీ నోట్లపై కూడా గాంధీ బొమ్మనే పెట్టుకున్నాం. అటువంటి మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే(Nathuram Godse)ని భారతీయులు ఎన్నటికీ క్షమించరు.

ఇంకా చదవండి ...

Godse Road In Karnataka: భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన గాంధీ(Gandhi)ని "మహాత్మా"అని గౌరవిస్తున్నాం. మన కరెన్సీ నోట్లపై కూడా గాంధీ బొమ్మనే పెట్టుకున్నాం. అటువంటి మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే(Nathuram Godse)ని భారతీయులు ఎన్నటికీ క్షమించరు. గాంధీ మీదున్న గౌరవంతో వీధులకు గాంధీ పేరు పెట్టుకుంటుంటారు.మనదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయా ప్రభుత్వాలు వీధులకు గాంధీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే గాంధీజీని చంపిన గాడ్సే (Gandhi assassin Godse)పేరును భారతదేశంలో కానీ మరే దేశంలో అయినా ఓ వీధికి పెట్టుకుంటారా? అంటే లేదనే అంటాం. కానీ కర్ణాటక(Karnataka)లోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్‌ గాడ్సే పేరుతో ఓ వీధిలో సూచిక బోర్డు పెట్టారు. బోలా గ్రామ పంచాయితీకి వెళ్లే రహదారిపై "నాథూరామ్ గాడ్సే రాస్తా" అనే సూచిక బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు వైరల్‌ కావడం, విమర్శలు రావడంతో పోలీసులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు.

సోమవారంగ్రామ పంచాయతీ అధికారులు పోలీసుల సమక్షంలో రోడ్డుపై ఉన్న బోర్డును తొలగించారు. ఈ బోర్డు ఎవరు పెట్టారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బోర్డు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాథూరాం గాడ్సే పేరు మీద ఎప్పుడు, ఎవరు సైన్ బోర్డు పెట్టారో గ్రామ పంచాయతీకి తెలియడం లేదని పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీవో) తెలిపారు. అయితే పోలీసులు దీనిపై ఆరా తీయగా బోర్డును రెండుమూడు రోజుల క్రితమే ఏర్పాటు చేశారని, సోమవారం అధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది. ఈ బోర్డును ప్రభుత్వం, గ్రామ పంచాయితీ అధికారులు ఏర్పాటు చేయ‌లేద‌ని, ఇది కొంద‌రి దుండగుల ప‌ని అని క‌ర్నాట‌క ఇంధ‌న శాఖ మంత్రి వి సునీల్ కుమార్ పేర్కొన్నారు. రెండు రోజుల కింద‌ట తాము ఈ బోర్డును గుర్తించి పంచాయితీ అధికారులు, పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని క‌ర్నాట‌క యూత్ కాంగ్రెస్ చీఫ్ యోగేష్ తెలిపారు. కొందరు దుండగులు కావాలనే వివాదం రేపేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని, వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

OMG : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని..భార్య చేయి నరికిన భర్త


Lipstick plant : 100 ఏళ్ల తర్వాత కనిపించిన లిప్ స్టిక్ మెక్క


కాగా,1948, జనవరి 30వ తేదీ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో మహాత్మా గాంధీ ప్రార్థనా సభకు కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. సమయం కోసం కాచుకుని ఉన్న నాథూరామ్ వినాయక్ గాడ్సే గాంధీని అక్కడే పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చారు. గాంధీ హత్య జరిగిన ఏడాది తరువాత ట్రయల్ కోర్టు గాడ్సేకి మరణశిక్ష విధించింది. 1949 నవంబర్‌లో గాడ్సేను ఉరితీశారు. ఈ పథకంలో గాడ్సేకు తోడుగా నిల్చిన నారాయణ్ ఆప్టేకి కూడా మరణశిక్ష విధించారు. మరో ఆరుగురికి జీవితఖైదు విధించారు. అయితే, ఇటీవల కాలంలో దేశంలోని కొందరు గాడ్సే పరాక్రమాన్ని కొనియాడుతూ, గాంధీ హత్యను బహిరంగంగా సమర్థిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఒక బీజేపీ ఎంపీ, గాడ్సేను "దేశభక్తుడిగా" అభివర్ణించారు. ఈ వ్యవహారం పట్ల అనేకమంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

First published:

Tags: Godse, Karnataka, Mahatma Gandhi

ఉత్తమ కథలు