Shocking: భార్య, పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు.. పోలీసుల విచారణలో అదిరిపోయే ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా పోయింది. దీంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకని విచారణ చేపట్టారు.

  • Share this:
    ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా పోయింది. దీంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. కర్ణాటక మంగళూరులో(Mangaluru) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అశోక్ నగర్ ప్రాంతంలో 30 ఏళ్ల రేణుకా చౌవ్వడాల్ (Renuka Chowwadal) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెతో పాటు అదే ఇంట్లో ఇద్దరు పిల్లలు, నాగరాజు అనే వ్యక్తి ఉంటున్నారు. అయితే సెప్టెంబర్ 18 రేణుక తన పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో నాగరాజు ఇంట్లో లేడు. కొన్ని పనుల మీద అతడు తన ఊరికి వెళ్లాడు.

    నాగరాజు తిరిగివచ్చేసరికి రేణుక, పిల్లలు కనిపించలేదు. దీంతో నాగరాజు.. వారు ఉంటున్న ఇంటి యజమాని రేణుక ఎక్కడికి వెళ్లిందని అడిగాడు. అయితే రేణుక తన బంధువుల ఇంటికి వెళ్తున్నట్టుగా చెప్పిందని ఇంటి యజమాని నాగరాజుతో చెప్పాడు. ఈ క్రమంలోనే రేణుక, ఆమె పిల్ల ఆచూకీ కోసం నాగరాజు పలు చోట్ల గాలింపు చేపట్టాడు. కానీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో నాగరాజు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో(Urwa police station) తన భార్య, పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

    Second Marriage: అతడి వయసు 49.. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. పెళ్లి కూడా ఫిక్స్ అయింది.. కట్ చేస్తే..

    ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. షాకింగ్ విషయాలను కనుగొన్నారు. నాగరాజ.. అసలు రేణుక భర్త కాదని తెలుసుకున్నారు. రేణుక భర్త ఇదివరకే చనిపోయాడని కనుగొన్నారు. భర్త మరణం (Husband Death) తర్వాత తన ఇద్దరు పిల్లలతో ఉంటున్న రేణుక.. నాగరాజుతో కలిసి ఉంటుంది. నాగరాజును పెళ్లి చేసుకోకుండా సహజీవనం సాగిస్తుంది. కొంతకాలంగా వారి బంధం బాగానే సాగుతుంది. చుట్టుపక్కల వారు కూడా రేణుక, నాగరాజులు భార్యభర్తలు అని అనుకున్నారు.

    శ్రీకాకుళం అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. కానీ అలా జరగడంతో..

    అయితే గత కొద్దిరోజులుగా నాగరాజు.. రేణుకను హింసించడం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగరాజు ఇంట్లో లేని సమయంలో ఆమె పిల్లలతో కలిసి పారిపోయంది. ఇక, రేణుకను, ఆమె పిల్లలను పోలీసులు గదగ్‌లో గుర్తించారు. మరోవైపు మంగళూరులో ఉన్న నాగరాజును విచారించగా.. తాము పెళ్లి చేసుకోలేదని అంగీకరించాడు. అయితే పెళ్లి కానందును నాగరాజుతో కలిసి ఉండాల్సిందిగా రేణుకకు చెప్పలేమని పోలీసులు చెప్పారు. నాగరాజుతో కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్పడంతో.. పోలీసులు వారికి విడివిడిగా జీవించాలని సూచించారు.
    Published by:Sumanth Kanukula
    First published: