హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పట్టుకున్న పాముతో సెల్ఫీకి ట్రై చేశాడు.. ఇంతలో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

పట్టుకున్న పాముతో సెల్ఫీకి ట్రై చేశాడు.. ఇంతలో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

పామును పట్టుకుని ముద్దాడుతున్న వ్యక్తి

పామును పట్టుకుని ముద్దాడుతున్న వ్యక్తి

Karnataka: పామును సరదాగా పట్టుకున్నాడు. దానితో సెల్ఫీలు దిగాడు. ఇంతలో దాన్ని ముద్దుపెట్టుకొవాలని చూశాడు. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

మనలో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. పొరపాటున పామును చూస్తే ఆ ప్రదేశంలోనికి వెళ్లడం మానేస్తారు. అసలు పాము పేరు ఎత్తడానికి కూడా ధైర్యం చేయరు.కొన్నిసార్లు పాములు మానవుని ఆవాసాల్లోకి వస్తుంటాయి. అవి ఆహారం కోసం, ఆవాసం కోసం దారి తప్పి మనుషుల ఇళ్లలోకి వస్తుంటాయి. ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు పాములు మనిషిని కాటు వేస్తాయి. మరికొన్నిసార్లు.. మనుషులు కూడా పాములను చంపేస్తుంటారు. అయితే.. కొందరు మాత్రం పాములు కన్పిస్తే, స్నేక్ హెల్స్ సోసైటీ వారికి సమాచారం ఇస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (karnataka) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివమొగ్గ జిల్లా భద్రావతి లోనిన బొమ్మన కట్టలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. బొమ్మన కట్టలో ఒక పాము ఇంటి ఆవరణలో కన్పించింది. దీంతో స్నేక్ సోసైటికి సమాచారం అందించారు. అయితే.. ఒక వ్యక్తి పామును పట్టుకున్నాడు.అక్కడ చుట్టుపక్కల ఉన్న వారంతా భయంభయంగా దాన్ని చూస్తున్నారు. ఇంతలో పామును పట్టుకున్నాక.. అతను దాన్ని ముద్దాడాలకున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

పాము ఒక్కసారిగా అతడిచేతిలో నుంచి ముఖంపై కాటు వేసింది. దీంతో అతను భయంతో పామును వదిలేశాడు. అక్కడున్న మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి పామును బంధించాడు. వెంటనే పాముకాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, Snake bite, Viral Video

ఉత్తమ కథలు