కొంత మందికి మూగ జీవాలను పెంచడం అంటే ఎంతో ఇష్టం. వాటిని తమ ఇంటిలో ఒక మనిషిలాగా చూసుకుంటారు. సాధారణంగా కుక్కలు, పిల్లులను ఎక్కువ మంది తమ ఇళ్లలో పెంచుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. పొరపాటున వాటికి ఏమైన అయితే, యజమానులు విలవిల్లాడిపోతారు. ఇక కుక్కలుకూడా అదే విధంగా విశ్వాసంతో ఉంటాయి. తమ యజమానిని ఒక్క నిముషం కూడా వదిలి ఉండవు. తోక ఊపుకుంటూ.. అతని చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి.
కొత్త వ్యక్తులను ఇంటికి అసలు రానివ్వవు. తమ యజమాని ఏదైన వేరే చోటకు వెళితే అన్నం కూడా ముట్టుకొవు. ఇంతటి ప్రేమను మూగజీవాలు కల్గి ఉంటాయి. అదే విధంగా, కొంత మంది యజమానులు కూడా అదే విధంగా ప్రేమను చూపిస్తుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. తాజాగా, మరోక ఉదంతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Dog Birthday Celebration :ಸಾಕು ನಾಯಿ ಹುಟ್ಟುಹಬ್ಬಕ್ಕೆ 100 ಕೆ.ಜಿ ಕೇಕ್! ||Karnataka Tak||#dogbirthday #doglover #belagamnews pic.twitter.com/csbjx2NDeo
— Karnataka Tak (@karnataka_tak) June 23, 2022
పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka) బెళగావి కి చెందిన శివప్ప ఎల్లప్ప అనే వ్యక్తి ఒక శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాన్ని ప్రేమగా.. క్రిష్ అనే పేరు పెట్టారు. అతను దాన్ని చిన్న తనం నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. దాన్ని ఒక నిముషం కూడా వదిలి పెట్టి ఉండే వాడు కాదు. ఈ క్రమంలో.. తనకు ఇష్టమైన కుక్క బర్త్ డే సెలబ్రేషన్ లను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశాడు. తన బంధువులను, స్నేహితులను, ఊరందరిని పిలిచాడు. అనుకున్నట్లే.. తన కుక్క కోసం (100kg cake) వంద కేజీల కేక్ తీసుకొచ్చాడు.
అందరి ముందు తన కుక్కతో కేక్ కట్ చేయించాడు. (Man Throws Grand Birthday Party For Pet Dog) దీనిలో పెద్ద ఎత్తున జనాలు హజరయ్యారు. ఆ తర్వాత.. పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. కాగా, శివప్ప .. తన పెంపుడు కుక్క పట్ల ఉన్న ప్రేమను ఇలా చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఆహా.. శునక వైభోగం అంటే ఇదే కదా.. నిజంగా నీకు కుక్క అంటే ఎంత ప్రేమ.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Birthday, Karnataka, Pet dog, Viral Video