Home /News /trending /

KARNATAKA MAN SETS CANARA BANK ABLAZE IN HAVERI AFTER HIS LOAN APPLICATION WAS REJECTED MKS

personal loan ఇవ్వలేదనే కోపంతో బ్యాంకుకే నిప్పు పెట్టాడు.. చివర్లో షాకింగ్ ట్విస్ట్

లోన్ ఇవ్వలేదని బ్యాంకుకు నిప్పు

లోన్ ఇవ్వలేదని బ్యాంకుకు నిప్పు

సాధారణంగా బ్యాంకువాళ్లు గనుక లోన్ అప్లికేషన్ తిరస్కరిస్తే చేసేదేమీలేక వేరే మార్గాలు వెతుక్కుంటారందరూ. కానీ ఈ యువకుడు మాత్రం లోన్ ఇవ్వలేదనే కోపంతో ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు. కర్ణాటకలోని హావేరి జిల్లా హెడిగొండలో చోటుచేసుకున్న ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి..

ఇంకా చదవండి ...
ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయడం సామాన్యులకే కాదు, బడా బాబులు, ప్రభుత్వాలకు అలవాటే. ఫైనాన్స్ రంగం బాగా విస్తరించిన ప్రస్తుత కాలంలో పర్సనల్ లేదా హోమ్ లోన్ పొందడమూ చాలా తేలికైపోయింది. ష్యూరిటీలు లేకున్నా సిబిల్ స్కోరు బాగుంటే సామాన్యులకూ లోన్లు దక్కుతున్నాయి. సాధారణంగా బ్యాంకువాళ్లు గనుక లోన్ అప్లికేషన్ తిరస్కరిస్తే చేసేదేమీలేక వేరే మార్గాలు వెతుక్కుంటారందరూ. కానీ ఈ యువకుడు మాత్రం లోన్ ఇవ్వలేదనే కోపంతో ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు. కర్ణాటకలోని హావేరి జిల్లా హెడిగొండలో చోటుచేసుకున్న ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి..

కర్ణాటకలోని హావేరి జిల్లా రట్టిహళ్లికి చెందిన వసీం హజరత్ సాబ్ ముల్లా అనే యువకుడు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఎలాగైనా రుణం పొందాలనే ప్రయత్నాల్లో భాగంగా కెనరా బ్యాంక్ హెడిగొండ బ్రాంచ్ వారిని సంప్రదించాడు. పర్సనల్ లోన్ కోరుతూ బ్యాంక్ మేనేజర్ కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే,

ముల్లా తగులబెట్టిన కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఇదే

Wife swap: భార్యలను మార్చుకుంటూ బరితెగింపు సెక్స్ -1000 జంటల వికృత రాసలీల


లోన్ మంజూరు చేయడానికి అవసరమైన పత్రాలు ముల్లా దాఖలు చేయలేకపోవడం, అతని సిబిల్ స్కోరు కూడా తక్కువగా ఉండటంతో రుణం మంజూరు చేయలేమని మేనేజర్ తెగేసి చెప్పాడు. ఈ విషయంలో కోపం పెంచుకున్న ముల్లా.. శనివారం రాత్రి షాకింగ్ చర్యకు ఒడిగట్టాడు. రాత్రి పూట దొంగలా బ్యాంకు బిల్డింగ్ వద్దకు వచ్చి, కిటికీలు బద్దలుకొట్టి, వెంట తెచ్చుకున్న బాటిల్ లో పెట్రోల్ ను లోనికి చల్లి, నిప్పటించాడు.

Hyderabad: కరోనా విలయంలో భారీగా వ్యాక్సిన్ల చోరీ.. దొంగలకూ whatsapp గ్రూపులు



నిమిషాల్లోనే బ్యాంకులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన స్థానికులు కొందరు తగలబడుతోన్న బ్యాంకు దగ్గర ముల్లాను చూసి అనుమానంతో పట్టుకోబోయారు. అప్పుడు ముల్లా తన దగ్గరున్న కత్తితో బెదిరించాడు. చివరకు ఎలాగోలా పట్టుకుని స్థానికులు ముల్లాకు దేహశుద్ధి చేశారు. స్థానికుల్లో ఒకరు పోలీస్, ఫైర్ శాఖలకు సమాచారం అందించారు. హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

బదిలీ బాధతో మొన్న టీచరమ్మ.. బదిలీ కాలేదని నిన్న కానిస్టేబుల్.. నిశ్చితార్థం రోజే హోటల్ గదిలో..



ముల్లా నిప్పు పెట్టడం వల్ల బ్యాంకులో రూ.12 లక్షల విలువైన సామాగ్రి తగలబడిపోయాయి. ఐదు కంప్యూటర్లు, పాస్ బుక్ ప్రింటర్, క్యాష్ కౌంటింగ్ మషీన్, డాక్యుమెంట్లు, క్యాష్ కౌంటర్ పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు చెప్పారు. నిందితుణ్ని అరెస్టు చేసే విచారించగా.. లోన్ ఇవ్వనందుకు బ్యాంకును తగలబెట్టాలనే ఐడియాను ముల్లాకు ఇచ్చింది ఓ బ్యాంకు మాజీ అధికారేనని తేలింది. బ్యాంకు మాజీ అధికారిపైనా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bank, Fire Accident, Karnataka, Personal Loan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు