Home /News /trending /

KARNATAKA MAN QUITS IT JOB TO START FIRST DONKEY FARM IN STATE GETS MILK ORDERS WORTH RS 17 LAKH PAH

OMG: గాడిదలు కాయడానికి ఐటీ ఉద్యోగం వదులుకున్నాడు.. ఎక్కడో తెలుసా..?

గాడిదలను పెంచుతున్న శ్రీనివాస్ గౌడ్

గాడిదలను పెంచుతున్న శ్రీనివాస్ గౌడ్

Karnataka: ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్షల్లో జీతం అయిన అది అతనికి నచ్చలేదు. తనకు ఉన్న కొద్ది పోలంలో అనేక జంతువుల ఫారమ్ లను ఏర్పాటు చేశాడు.

పెద్దలు తరచుగా చిన్న తనంలో ఎగ్జామ్స్ లో పాస్ కాకుంటే వెళ్లి గాడిదలు కాయ్..అంటూ తిడుతుండేవారు. అయితే, ఇక్కడో యువకుడు పరీక్షలో ఫెయిల్ కాలేదు. ఇంజనీరింగ్ చదివాడు. అంతే కాకుండా లక్షల్లో శాలరీ వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, అతనికి ఎక్కడ అసంత్రుప్తి ఉండేది. తాను పుట్టిన దేశానికి ఏదో ఒకటి చేయాలని తపిస్తుండేవాడు. దీంతో తాను చేస్తున్న ఉద్యోగం మానేసి తనకు ఉన్న (Man quits IT job) కొద్ది పొలంలో ఆవులు,గెదెలు, మేకలు,కుందేళ్ల ఫారమ్ లను ఏర్పాటు చేశాడు. అయితే, కొద్ది కాలంగా అతను గాడిదలను తక్కువగా చూడటం గమనించాడు. గాడిదల ఉపయోగం తగ్గిపొవడం వలన వాటిని చులకనగా చూస్తున్నారు.

ఒకప్పుడు చాకలి వాళ్లు గాడిదలను (Donkey firm) ఉపయోగిస్తుండేవారు. బట్టలను వాటిపై పెట్టుకుని ఉతకడానికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం వాషింగ్ మెషిన్ లు రావడం వలన ఎవరి ఇంట్లో వారు బట్టలు ఉతుక్కుంటున్నారు. ఈ క్రమంలో గాడిదలను చిన్న చూపు చూస్తున్నారు. దీంతో కర్ణాటకలోని ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్ చలించిపోయాడు. వెంటనే తన పొలంలో ఇప్పటికే ఉన్న జంతువుల ఫారమ్ లతో పాటు, కొత్తగా గాడిదల ఫారమ్ లను కూడా ప్రారంభించాడు. ఈ ఘటనలో గతంలోనే వార్తలలో నిలిచింది. ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో (Social media) ట్రెండింగ్ గా మారింది.



పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka) ఇరా గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఇంజనీరింగ్ చదివి, మంచి ఐటీ ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత అది నచ్చక, 2020లోనే ఉద్యోగం మానేశాడు.తనకున్న 2.3 ఎకరాల్లో పశువుల ఫారమ్ లను ఏర్పాటు చేశాడు.ఈ క్రమంలో గాడిదల ఫారమ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అప్పుడు అతడి పనికి నవ్వుకున్నారు. కానీ ఈ క్రమంలో అతను.. గాడిదల ఫారమ్ ను ఏర్పాటు చేశాడు. గాడిద పాలలో ఔషధ గుణాలు, అనేక రోగాలను తగ్గించే గుణాలు ఉంటాయని గుర్తించాడు. గాడిద పాలను బ్యూటీపార్లర్ ప్రొడక్ట్స్ లో వినియోగించారు.

అదే విధంగా అతని దగ్గర 20 వరకు గాడిదలు ఉన్నట్లు తెలిపాడు. అతని దగ్గర పశువులు, మేకలు, కుందేళ్లు, కడక్ నాథ్ కోళ్లు, గాడిద ఫారమ్ లు ఉన్నాయి. ప్రస్తుతం అతను 30 ఎంఎల్ గాడిద పాల ధరను.. రూ. 150 కి విక్రయించాడు. ప్రస్తుతం అతనికి, ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఒక ప్రముఖ కంపెనీ 17 లక్షల రూపాయల గాడిద పాల కోసం ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం వింత ఘటన వార్తలలో నిలిచింది. కాగా, ఇప్పటికే కేరళలో ఒక గాడిద ఫారమ్ ఉంది. ఇప్పుడు మరోకటి కర్ణాటకలో ఉంది. ఈ వార్త మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral news)  గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Donkey, Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు