హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: ప్రిన్సి పాల్ ను లాగి చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

OMG: ప్రిన్సి పాల్ ను లాగి చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

ప్రిన్సిపాల్ ను కొడుతున్న ఎమ్మెల్యే

ప్రిన్సిపాల్ ను కొడుతున్న ఎమ్మెల్యే

Karnataka: కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడటానికి ఎమ్మెల్యే వచ్చారు. ఆ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంతలో ఎమ్మెల్యే ఎవరు ఊహించని విధంగా ప్రవర్తించారు.

కొందరు రాజకీయ నాయకులు అధికారం తమ చేతిలో ఉందని ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తారు. తమ అధికారం బలంతో ఏదైన చేయడానికి వెనుకాడరు. కొన్ని సార్లు వీరు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వారిపైన దాడులు చేస్తుంటారు. ఇప్పటికే పలువురు నాయకులు.. కంట్రోల్ తప్పి తమ తోటి నాయకులను, అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అనేక సంఘనలను చూశారు. తాజాగా, మరో ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka) ఒక కళాశాలలో జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు పర్యవేక్షించడానికి వచ్చారు. అప్పుడు కొన్ని పనులు పూర్తి కాలేదు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. ప్రిన్సిపాల్‌ని నోటికొచ్చినట్లు తిడుతూ చెంపదెబ్బ కొట్టారు. స్థానిక రాజకీయ నాయకుడు.. ఎం శ్రీనివాస్, కళాశాల సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో.. కంప్యూటర్ ల్యాబ్ కోసం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆయను పిలిచి అందరిముందే చడామడా తిట్టేసి, చెంపదెబ్బ కొట్టారు. జూన్ 20న మండ్యలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ (Video viral) అవుతోంది. కాగా, మాండ్యా ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ పునరుద్ధరించబడిన నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ITI కళాశాలను సందర్శించేటప్పుడు ప్రిన్సిపాల్‌ని పదే పదే కొట్టడం కనిపిస్తుంది. ప్రస్తుతం నెటిజన్లు.. ఎమ్మెల్యే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత మంది ముందు ఒక ప్రిన్సిపల్ ను చేయిచేసుకొవడం ఏంటని, దీనిపై వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయాలని ప్రిన్సిపల్ కు సూచిస్తున్నారు.


ఇదిలా ఉండగా  ఆస్ట్రేలియాలో (Australia)  ఒక వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది.

కొన్ని సార్లు నీటిలో ఉండే మొసళ్లు (Crocodile)  ఒడ్డుకు వస్తుంటాయి. సాధారణంగా చెరువులు, సరస్సులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో.. తరచుగా ఒడ్డుకు వస్తుంటాయి. కొన్ని సార్లు.. మనుషుల కంట పడతాయి. అప్పుడు అవి దాడులకు పాల్పడతాయి.

ఆస్రటేలియా ప్రాంతంలోని ల్యాండ్ డౌర్ లో ఈ ఘటన జరిగింది. అక్కడి నార్తర్న్ టెరిటరీ పబ్ కు చెందిన యజమానిపై మొసలి దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే అతను చాకచక్యంగా ప్రవర్తించాడు. తన చేతిలోని దోసా ప్యాన్ తో (Man uses frying pan)  మొసలిపై ముఖంపై చితకొట్టాడు. ఆ పబ్ చెరువుకు సమీపంలో ఉంటుంది. అక్కడ తరచుగా మొసళ్లు ఒడ్డుకు వస్తుంటాయి. అయితే.. అతను తన చేతిలోని దోసా ప్యాన్ తో మొసలి ముఖంపై కొట్టాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్  నెట్టింట వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, Trending video, Viral Video

ఉత్తమ కథలు