Home /News /trending /

KARNATAKA HIJAB ROW MUSLIM GIRL STUDENT ALLAH HU AKBAR RESPONS TO SAFFRON SCARF BOYS GROUP JAI SHRI RAM CHANT MKS

Viral Video: జైశ్రీరామ్ నినాదాల మధ్య ముస్లిం విద్యార్థిని ఇలా : Hijabపై హైడ్రామా: Owaisi రియాక్షన్

మాండ్యా కాలేజీలో దృశ్యం

మాండ్యా కాలేజీలో దృశ్యం

మాండ్యా జిల్లాలోని ఓ కాలేజీలో ఒటరి ముస్లిం విద్యార్థినిని జైశ్రీరాం నినాదకారులు చుట్టుముట్టడం, ఆమె అల్లాహు అక్బర్ అని ప్రతిస్పందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సంచలనంగా మారింది..

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో హిజాబ్ (ముస్లిం మహిళలు ధరించే బుర్ఖా) వివాదం అంతకంతకూ ముదురుతున్నది. స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్(బుర్ఖా) ధరించడంపై ఆంక్షేపణలతో మొదలైన వివాదం క్రమంగా పెద్దదవుతూ, హిందూవాద విద్యార్థి సంఘాల ఆందోళనలతో తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో మతాలకు అతీతంగా విద్యార్థులంతా నిబంధనల ప్రకారమే దుస్తులు ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులూ వివాదాస్పదమయ్యాయి.

హిజాబ్ వివాదంపై  కర్ణాటక హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే, పలు జిల్లాలో రెండు వర్గాల విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. మాండ్యా జిల్లాలోని ఓ కాలేజీలో ఒటరి ముస్లిం విద్యార్థినిని జైశ్రీరాం నినాదకారులు చుట్టుముట్టడం, ఆమె అల్లాహు అక్బర్ అని ప్రతిస్పందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సంచలనంగా మారింది. (ఆ వీడియో చివరి పేరా దగ్గరుంది)

మాండ్యా కాలేజీలో దృశ్యాలు

CM KCRపై దేశద్రోహం కేసు.. PM Modi బాడీ షేమ్, నిర్మలకు అవమానం: BJP సంచలనం



కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. మాండ్యా, ఉడుపి తదితర జిల్లాల్లో విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాండ్యా సిటీలోని పీఈఎస్ కాలేజీలో తాజాగా చోటుచేసుకున్న ఓ దృశ్యం విపరీతంగా వైరలైంది. దాదాపు 30 మంది అబ్బాయిల గుంపు మెడలో కాషాయ కండువాలు ధరించి, జైశ్రీరాం నినాదాలతో కాలేజీ ముందు ఆదోళన చేశారు. ఆ సమయంలోనే బైక్ పై కాలేజీకి వచ్చిన ముస్లిం విద్యార్థిని.. లోపలికి వెళ్లబోతూ యువకుల గుంపుతో తారాసపడింది. అబ్బాయిలు బిగ్గరగా జైశ్రీరామ్ నినాదాలు చేయగా, వాళ్లకు సమాధానమిస్తున్నట్లుగా ఆ ఒంటరి అమ్మాయి కూడా అదే స్థాయిలో అల్లాహు అక్బర్ అని పలుమార్లు గట్టిగా అరిచింది. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

మాండ్యా కాలేజీలో దృశ్యం

PM Modi: ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -ఇండియా 1947లో పుట్టిందా?



అంతలోనే అక్కడున్న లెక్చరర్లు ఆ అమ్మాయికి సర్దిచెప్పి లోనికి పంపే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆమె అల్లాహు అక్బర్ నినాదం చేస్తూ ముందుకు కదిలింది. కాషాయ స్కార్ఫులు ధరించిన యువకులు జైశ్రీరామ్ నినాదాన్ని తీవ్రతరం చేసి ఆమెను వెంబడించినంత పనిచేశారు. ఈ దృశ్యంతాలూకు వీడియో వైరలైంది. ఒటరి ముస్లిం యువతి ధీటుగా బదులిచ్చిందంటూ కామెంట్లు వచ్చాయి. అదే సమయంలో వ్యతిరేక వ్యాఖ్యలు కూడా వచ్చాయి. దీనిపై..



PM Modi : ఇండియా దేశం కాకుంటే పార్టీ పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎందుకైంది? నెహ్రూ ఫ్యామిలీది హింసావాదం

హిజాబ్ వివాదంలోనే సంచలన వీడియోగా మాండ్యా సంఘటన విపరీతంగా షేర్ అవుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అమ్మాయిని పెంచిన త‌ల్లిదండ్రుల‌కు అభినంద‌న‌ల‌ని, భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసేవారిని అంద‌రూ (ఈ అమ్మాయిలానే) ధైర్యంగా ఎదుర్కోవాల‌ని ఒవైసీ పిలుపునిచ్చారు. ఆందోళ‌న‌కారుల‌ను ధైర్యంగా ఎదుర్కొన యువ‌తిని ఆయన అభినందించారు. ముస్లిం విద్యార్థిని వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. హిజాబ్ వివాదం ముదరడంతో కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. మూడు రోజులు సెలవులు ప్రకటించింది.
Published by:Madhu Kota
First published:

Tags: Karnataka, Muslim Minorities, Viral vide

తదుపరి వార్తలు