Gun License: కర్ణాటకలో కొడవా తెగల వారికి ఆయుధ చట్టాల నుంచి మినహాయింపు... సమర్థించిన హైకోర్టు

ప్రతీకాత్మకచిత్రం

కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన కొడవాలు(Kodavas), జమ్మా భూ యజమానులకు బ్రిటిష్ కాలం నుంచి ఆయుధాల చట్టాల నుంచి మినహాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 నోటిఫికేషన్ లో కొడగు జిల్లాలోని కొడవాలు(Kodavas), జమ్మా భూ యజమానుల (Jamma land holders)కు లైసెన్స్ పొందడం నుంచి మినహాయింపు ఇచ్చింది.

  • Share this:
భారతదేశ ఆయుధ చట్టాల ప్రకారం సామాన్యులు తుపాకులు కొనుగోలు చేయడం, వాటిని ఉపయోగించడానికి లైసెన్స్ పొందాలి. ఎవరికైనా ప్రాణహాని ఉందంటే.. గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. కానీ లైసెన్స్ పొందడానికి చాలా క్లిష్టతరమైన ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలోని ఒక ప్రాంతంలో నివసిస్తున్న ఓ జాతి ప్రజలకు పిస్టల్స్, రివాల్వర్లు, డబుల్ బారెల్ షాట్‌గన్‌లను ఉపయోగించడానికి ఎలాంటి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదు. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన కొడవాలు(Kodavas), జమ్మా భూ యజమానులకు బ్రిటిష్ కాలం నుంచి ఆయుధాల చట్టాల నుంచి మినహాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 నోటిఫికేషన్ లో కొడగు జిల్లాలోని కొడవాలు(Kodavas), జమ్మా భూ యజమానుల (Jamma land holders)కు లైసెన్స్ పొందడం నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజాగా కర్ణాటక హైకోర్టు కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ ప్రామాణికత (constitutional validity)ను సమర్థించింది.

Viral Videos : ఈ మహిళ వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?


ఈ మినహాయింపు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు హైకోర్టు వెల్లడించింది. కూర్గ్‌(కొడగు జిల్లా)లోని ప్రతి వ్యక్తికి జాతివారీగా మినహాయింపు మంజూరు చేసింది. దీనితో కూర్గ్‌లోని జమ్మా కౌలుదారులు తుపాకీలను సొంతం చేసుకోవడానికి, యూజ్ చేయడానికి లైసెన్స్ పొందవలసిన అవసరం లేదు. జూన్ 30న ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి రిటైర్ అయిన కెప్టెన్ చేతన్ వై.కే(41).. 'ఆ ఒక్క జాతికే మినహాయింపు ఎందుకు?' అన్నట్లు ఒక పిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సచిన్ శంకర్ మగడుమ్‌తో కూడిన డివిజన్ బెంచ్ మినహాయింపు కొనసాగుతుందనే ఆదేశాన్ని జారీ చేసింది.

Alcohol Museum: ఆ మ్యూజియం మొత్తం ఆల్కహాలే.. ఎక్కడ లాంచ్ చేశారో తెలుసా..


"మార్షల్ కమ్యూనిటీ అయిన కొడవ సమాజం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి మినహాయింపు బెనిఫిట్స్ అనుభవిస్తోంది. ఎప్పటి నుంచో జమ్మా పదవీ కాలం ఉన్నవారు మినహాయింపును అనుభవిస్తున్నారు. మినహాయింపు కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుంది. కాబట్టి, నోటిఫికేషన్ రాజ్యాంగపరమైన చెల్లుబాటును పిటిషన్‌లో సమర్థిస్తున్నామని" అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

కొడవ ప్రజలు
కర్ణాటకలోని అతి చిన్న జిల్లా అయిన కొడగులో నివసించే ఒక ప్రత్యేకమైన జాతి ప్రజలను కొడవ ప్రజలు అని పిలుస్తారు. బ్రిటిషర్లు కొడగును కూర్గ్ అని పిలిచేవారు. కొడవ ప్రజలు పురాతన యుద్ధ తరహా తెగకు చెందినవారిని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతుంటారు. వారు మొహెంజోదారో కాలంలో సింధు లోయలోకి ప్రవేశించి, తరువాత కూర్గ్‌కు వలస వచ్చిన బ్రాడ్-హెడ్ (బ్రాచీసెఫాలిక్) స్టాక్ వారసులు అని కూడా అంటుంటారు. వీరు అలెగ్జాండర్ తో కలిసి భారతదేశంలోకి వచ్చిన ఇండో-గ్రీక్ సైనికుల వారసులని కూడా చెబుతుంటారు. బ్రిటిష్ అధికారులు కొడవ ప్రజల యుద్ధ సాంప్రదాయాలను గుర్తించి 1861లో లైసెన్స్ లేకుండానే తుపాకీలను వాడే ప్రత్యేక హక్కును ప్రసాదించారు.
Published by:Krishna Adithya
First published: