సాధారణంగా ఎలుకలు పుస్తకాలు,పేపర్ లు, పంట ధాన్యలు తింటుంటాయి. ఇవి మన ఇళ్లలో చేసే బీభత్సం తెలిసిందే. తినే పదార్థాలను అన్నింటిని లాక్కెళతాయి. కొన్ని సార్లు.. ముఖ్యమైన పత్రాలను కూడా కొరికేస్తుంటాయి. దీంతో మనం మన ఇళ్లలో రాట్ కిల్ కేక్, ఎలుకల కాళ్లకు అతుక్కునే కేక్ తెచ్చి ఇంట్లో పెడుతుంటాం. మరికొందరు పిల్లులను కూడా పెంచుతుంటారు. ఈ కోవకు చెందిన ఫన్నీ సంఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..బెంగళూరు(bengaluru) నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరిబిదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్ను 2014లో నిర్మించారు. కొన్ని రోజులుగా ఎలుకలు నానా రచ్చ చేస్తున్నాయి. ముఖ్యమైన ఫైళ్లను, పత్రాలను ఎలుకలు కొరికివేయడం ప్రారంభించడంతో అధికారులు ఒత్తిడికి గురయ్యారని పోలీసు స్టేషన్ వర్గాలు తెలిపాయి. దీనిపై స్టేషన్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా, గౌరిబిదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. తమ స్టేషన్.. సమీపంలో ఒక సరస్సు ఉన్నందున, ఎలుకలు పోలీసు స్టేషన్ను నివసించడానికి సురక్షితమైన ప్రదేశంగా గుర్తించినట్లు తెలుస్తోందని అన్నారు. అందుకే తాము పిల్లులను (cats) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దీంతో అవి ఎలుకలను (Cops engage cats to catch rats) వేటాడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రెండు పిల్లులు మూడు ఎలుకలను చంపాయని అధికారి తెలిపారు. ఇక పిల్లులకు తాము.. ప్రత్యేకంగా చూసుకుంటున్నామని తెలిపారు. దాని కోసం పాలు, ఆహారం పెడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్నాటక రాష్ట్రంలోని అనేక విభాగాలు ఎలుకలు, దోమల బెడదను అరికట్టడానికి బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని గతంలో కేటాయించినట్లు సమాచారం.
ఎలుకలు, దోమల బెడదను ఎదుర్కోవడానికి కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (కెఇఎ) సంవత్సరానికి సుమారు రూ. 50,000 ఖర్చు చేస్తుందని ఇటీవల సమాచార హక్కు (ఆర్టిఐ) ప్రశ్న వెల్లడించింది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, 2010-15 మధ్య ఎలుకలను పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 19.34 లక్షలు ఖర్చు చేసిందని ప్రత్యేక ఆర్టీఐ ద్వారా తెలిసింది. ప్రస్తుతం పిల్లుల కొలువుల ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cat, Karnataka, Police station, VIRAL NEWS