హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పిలిచి మరీ గెలుక్కోవడం అంటే ఇదే.. ఏనుగుల రియాక్షన్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

పిలిచి మరీ గెలుక్కోవడం అంటే ఇదే.. ఏనుగుల రియాక్షన్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

దాడి చేస్తున్న ఏనుగు

దాడి చేస్తున్న ఏనుగు

Viral video: ఏనుగుల గుంపు రోడ్డు మీదకు వచ్చింది. ఆ మందలో కొన్ని పెద్ద ఏనుగులు, పిల్ల ఏనుగు ఉన్నాయి. అవి మెల్లగా ఒక వైపు నుంచి రోడ్డును దాటుకుంటూ మరోక వైపుకు వెళ్తున్నాయి.

కొన్ని సార్లు జంతువులు దారితప్ప జనావాసాల్లోకి వస్తుంటారు. మనం తరచుగా చిరుతపులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, పాములు మన ఇళ్ళ ఆవాసాల్లోకి వస్తుండటం మనకు తెలిసిందే. ఇవి మెయిన్ గా.. ఆహరం కోసం, నీళ్ల కోసం వస్తుంటాయి. కొన్ని సార్లు... మనుషులపైకి దాడులు చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తుంటాం. అయితే, ఏనుగుల గుంపు ఇక్కడ రోడ్డు దాటుతున్నాయి. కొంత మంది ప్రయాణికులు.. వాటికి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించారు. దీంతో అవి బెదిరిపోయాయి. వెంటనే కారులో ఉన్నవారికి చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో (Social media) వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (karnataka) భయానక ఘటన జరిగింది. హసనూర్ అటవీ ప్రాంతంలోని అడవి సమీపంలో ఇది సంభవించింది. కొన్ని ఏనుగులు (Elephant) అడవి గుండా రోడ్డుమీదకు వచ్చాయి. అవి గుంపులుగా ఉన్నాయి. ఇంతలో ప్రయాణికులు.. వాటికి హర్న్ మోగిస్తు..ఇరిటేట్ తెప్పించారు. దీంతో అవి బెదిరిపోయాయి. వెంటనే కారుపైకి దూసుకొచ్చాయి. అద్దాలను తమ తుండంతో ధ్వంసం చేశాయి.

గట్టిగా ఘీంకరిస్తు.. కారుపై తమ ప్రతాపం చూపించాయి. దీంతో భయపడిపోయిన డ్రైవర్ కారు నుంచి బైటకు పరుగులు పెట్టాడు.ఈ వీడియోను.. సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ (viral video)  గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. గెలుక్కొవడమంటే ఇదే.., పాపం.. వాటి మానన వాటిని డిస్టర్బ్ చేయకుండా పొనిస్తే... ఇలా చేయవు కదా.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఒక యువతి తన పెద్ద మనసును చాటుకుంది.

రోడ్డుపక్కన ఒక ఉడతను అమ్మాయి చూసింది. అది నీళ్ల కోసం అక్కడ వెతుకుతుంది. కింద పడిన కొద్దిగా ఉన్న నీళ్లను తన నాలుకతో నాకుతుంది. దీన్ని అమ్మాయి గమనించింది. వెంటనే తన చేతిలోని బాటిల్ ను ఉడత ముందు పెట్టింది. ఉడత కూడా ఏమాత్రం భయపడకుండా బాటిల్ లోని నీళ్లలను గట గట తాగేసింది. అమ్మాయి కూడా ఉడత నీళ్లు తాగే వరకు ఒపిగ్గా అక్కడే బాటిల్ పట్టుకుని నిలబడింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను బ్యూటెంగెబిడెన్ అనే ఖాతా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో (viral video) నెట్టింట వైరల్ గా మారింది.

First published:

Tags: Elephant attacks, Karnataka, Trending video, Viral Video

ఉత్తమ కథలు