హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

లక్షల్లో ప్రైజ్ మనీ గెలుచుకున్న ఎద్దు.. 500 మందికి విందు భోజనం.. ఎద్దు కథ మాములుగా లేదుగా..

లక్షల్లో ప్రైజ్ మనీ గెలుచుకున్న ఎద్దు.. 500 మందికి విందు భోజనం.. ఎద్దు కథ మాములుగా లేదుగా..

ప్రైజ్ మనీ గెలుచుకున్న ఎద్దు

ప్రైజ్ మనీ గెలుచుకున్న ఎద్దు

karnataka: పోటీ చేసిన ప్రతి చోట్ల లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. బంగారం, వెండి పతకాలను రైతుకు అందించింది. దీంతో సదరు ఎద్దు యజమాని.. గ్రామస్థులకు విందు భోజనం పెట్టాడు.

కొందరు మూగజీవాలను తమ ఇళ్లలోని మనుషుల మాదిరిగా చూసుకుంటారు. రైతులు ప్రధానంగా ఆవులు, ఎద్దులను ఎంతో ఇష్టంతో పెంచు కుంటుంటారు. కొంత మంది తాము పెంచుకుంటున్న ఎడ్లను, వేరే ఎడ్లకంటే ప్రత్యేకంగా ఉండేలా చూస్తుంటారు. వీటిని గ్రామాల్లో జరిగే వివిధ రకాల పోటీల్లో పాల్గొనడానికి స్పెషల్ గా తయారు చేస్తుంటారు. వీటిని ఎడ్ల పోటీలకు సిద్ధం చేస్తుంటారు. ఇవి తమ ఆయా పశువుల పోటీల్లో పాల్గోని రైతులకు ప్రత్యే బహుమతులు తెచ్చిపెడతాయి. ఇలాంటి ఎన్నో రైతులకు చెందిన ఉదంతాలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఉదంతం వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka) బాగాల్కొట్ కు చెందిన ఎద్దు(Bagalkot bull) ప్రస్తుతం వార్తలలో నిలిచింది. చిమ్మడ్ జిల్లాకు చెందిన మయప్ప దొడ్డమాని అనే రైతు ఒక ఎద్దుని పెంచుకుంటన్నాడు. అతను ఎద్దును ఆరేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అప్పుడు దాని వయసు మూడేళ్లు. అప్పటి నుంచి దొడ్డమానిస్ ఎద్దును, తన ఇంట్లోని మనిషిగా చూసుకుంటున్నాడు. దాన్ని ప్రత్యేకంగా తిండి పెట్టేవాడు. దాన్ని స్పెషల్ గా ఎద్దుల పోటీల్లో పాల్గొనేలా దాన్ని తయారు చేశాడు. ఇప్పటి వరకు అది రైతుకు అనేక సార్లు ప్రైజ్ మనీ, బంగారం, వెండి పతకాలను తెచ్చిపెట్టింది.

అయితే, అతను దాన్ని కొన్ని కారణాలతో సదాశివ సిద్ధప్ప డాంగే అనే రైతుకు అమ్మేశాడు. అయితే, ఇంతకాలం తనతో పాటు ఉన్న ఎద్దుకు గుర్తుగా తన గ్రామంలోని సుమారు 500 ల మందికి విందు భోజనం ఏర్పాటు చేశాడు. అతను హర్టి గ్రామంలోని సదాశివ సిద్ధప్ప డాంగేకు 11.5 లక్షలకు ఎద్దుని అమ్మేశాడు. ఇప్పటి వరకు ఇది 7.5 లకలు, 9 లకలు, 10 లకల ప్రైజ్ మనీని గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ఎద్దు స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఇదిలా ఉండగా ఒక కోతి ఆస్పత్రికి వెళ్లి మరీ ట్రీట్ మెంట్ చేయించుకుంది.

బీహార్ లో (Bihar) ఒక వింత ఘటన జరిగింది. ససారంలో అనే గ్రామ పరిధిలో ఒక కోతి తీవ్రంగా గాయపడింది. మరీ అది వేరే కోతులు దానిపైన దాడిచేశాయో.. లేక ఎక్కడి నుంచి ప్రమాద వశాత్తు పడిందో కానీ ఆడ కోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ కోతి తన బిడ్డనేస్కోని షాజామా ప్రాంతంలోని ఆస్పత్రి ముందు వెళ్లి (Wounds Treated) కూర్చుంది. అక్కడి వారివైను బాధతో, దీనంగా చూసింది. అక్కడ కోతిని చూసిన వారు మొదట్లో చాలా భయపడ్డారు. కానీ అక్కడి డాక్టర్ అహ్మద్ కోతి (Monkey Visits Clinic) గాయమైనట్లు గమనించాడు. మెల్లగా దాని దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత దాన్ని క్లినిక్ లోపలికి తీసుకెళ్లి సపర్యలు చేశారు. కోతి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కల్గించలేదు.

డాక్టర్ దాని గాయాలకు మందులు పూశారు. కాసేపు అక్కడే ఉండి, మెల్లగా వెళ్లిపోయింది. ఈ ఘటన చుట్టుపక్కల జనాలకు తెలియడంతో ఆస్పత్రికి గుంపులుగా గుంపులుగా చేరుకున్నారు. డాక్టర్ దగ్గర కోతి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సన్నివేశాన్ని తన సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video) హల్ చల్ చేస్తుంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, Trending news

ఉత్తమ కథలు