అడ్డదారుల్లో లక్షలు లక్షలు సంపాదించే అధికారులు.. వాటిని దాచుకోవడానికి కొత్త కొత్త దారులను వెతుకుతుంటారు. అయితే ఇలా తమ దొంగ సొమ్మును తనిఖీ చేసేందుకు ఏసీబీ అధికారులు హఠాత్తుగా ఎంట్రీ ఇస్తే.. ఏం చేయాలో వారికి అర్థంకాదు. కొందరు సైలెంట్‌గా ఏసీబీ అధికారులకు సరెండర్ అయిపోయి.. లెక్కల్లో లేని దొంగ సొమ్మును వారికి అప్పగిస్తారు. అయితే ఎలాగైనా వారికి తమ దొంగ సొమ్మును దొరక్కూడదని అనుకునే కొందరు దేశముదుర్లు మాత్రం... వాటిని దాచిపెట్టేందుకు కొత్త కొత్త ఐడియాలను అమలు చేస్తుంటారు. కర్ణాటకలోని ఓ అవినీతి ఇంజినీర్ అధికారి కూడా ఈ కోవలోకే వస్తాడు. కలబుర్గిలోని PWD జూనియర్ ఇంజినీర్ ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. అక్కడ మొత్తం రూ. 54 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్థాయిలో డబ్బును స్వాధీనం చేసుకోవడం కొత్తేమీ కాకపోయినా.. మనోడు ఏసీబీ అధికారులకు దొరక్కుండా దాచిపెట్టిన రూ. 13 లక్షలను కూడా ఏసీబీ అధికారులు కనిపెట్టడం ఈ మొత్తం సీన్‌లో హైలైట్ అని చెప్పాలి. ఏసీబీ అధికారుల తన ఇంటిపై దాడి చేయడానికి వస్తున్నారని ముందుగానే సమాచారం వచ్చిందేమో తెలియదు కానీ.. ఏకంగా రూ. 13 లక్షల విలువ చేసే కరెన్సీని డ్రైనేజీ పైపుల్లో పడేశాడు సదురు అవినీతి అధికారి. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఏసీబీ అధికారులు ఆ పైపును పగలగొట్టి.. ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
#WATCH | ACB officials find money in the Pipeline of PWD Junior Engineer Shanta Gowda's house in Kalaburagi, #Karnataka pic.twitter.com/mbNnhSRu40
— News18 (@CNNnews18) November 24, 2021
కర్నాటక వ్యాప్తంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన భారీ సోదాల్లో ప్రభుత్వ అధికారులకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఇళ్లు, ప్లాట్లు వంటి బంగారు ఆభరణాలు, నగదు, స్థిరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, 300 మంది సిబ్బందితో కూడిన బృందం 15 మంది అధికారులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి 60 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ తెలిపింది.
కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?
Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?
వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టిఎస్ రుద్రేశప్ప గడగ్ నివాసంలో కనీసం రూ.3.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారి తెలిపారు. మంగళూరు స్మార్ట్ సిటీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎస్ లింగేగౌడ ఆస్తులపై దాడులు నిర్వహించినట్లు ఎసిబి ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా అనేక మంది అధికారుల ఇల్లు, వారి సన్నిహితుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నట్టు వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Karnataka, Viral Video