హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: పొలంలో నిద్రిస్తున్న మహిళపై పడగ విప్పిన నాగు పాము.. క్లిప్పింగ్స్ వైరల్..

OMG: పొలంలో నిద్రిస్తున్న మహిళపై పడగ విప్పిన నాగు పాము.. క్లిప్పింగ్స్ వైరల్..

మహిళ మీద పడగ విప్పి కూర్చున్న పాము

మహిళ మీద పడగ విప్పి కూర్చున్న పాము

Karnataka: మహిళ పొలంపనులు చేసుకుని హయిగా నిద్రిస్తుంది. ఇంతలో ఆమెకు మంచి నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఒక పాము.. ఆమె వీపుపై ఎక్కికూర్చోని బుసలు కొడుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

మనలో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. అసలూ పాముల పేరు ఎత్తడానికి కూడా చాలా మంది సాహాసించరు. పొరపాటున పాములు కన్పిస్తే.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. కొన్నిసార్లు.. పాములు దారితప్పి మనుషుల ఆవాసాల్లోకి వస్తుంటాయి. అలాంటప్పుడు అవి మనుషుల కంటపడతాయి. అలాంటి కొన్ని సందర్భాలలో ఎక్కడ తమకు అపాయం కల్గ చేస్తారో అని, పాములను చంపుతుంటారు. మరికొన్నిసార్లు పాము (Snake) చేతిలో కాటుకు కూడా గురౌతుంటారు. ఇప్పటికే పాములకు సంబంధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, పొలంలో నిద్రిస్తున్న మహిళ వీపు మీద పాము ఎక్కికూర్చుంది.


పూర్తివివరాలు.. కర్ణాటకలోని (karnataka) కలబురిగి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మల్లాబాద్ కు చెందిన భాగమ్మ అనే మహిళ తన పొలంలో పడుకుంది. అప్పుడు ఆమె వీపు మీద పెద్ద నాగు పాము వచ్చి పడగ విప్పి కూర్చుంది. దాన్ని అక్కడున్న వారు చూసి,అరవడంతో మహిళకు మెళకువ వచ్చింది. ఈ క్రమంలో.. మహిళ వెంటనే భయంతో వణికిపోయింది. పాము మాత్రం పడగ విప్పుకుని, బుసలు కొడుతూ.. అక్కడ నిలబడి చూస్తుంది. ఆమె భయంతో శ్రీ శైలం మల్లన్న, జై మల్లీకార్చున అంటూ శివుడిని పదే పదే తలుచుకుంది. పదే పదే ఆ శివుని పేరు బిగ్గరగా జపం చేసింది.అయితే.. ఆ దేవుడు అనుగ్రహించాడో మరేంటో కానీ.. ఆ పాము కాసేపు అక్కడే ఉంది, ఆ తర్వాత వెళ్లిపోయింది. ఇదంతా అక్కడ గట్టుమీద ఉన్నమరో బాలుడు రికార్డు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. నిజంగా ఆమెకు లక్ బాగానే ఉందని కొంత మంది, ఆమెకు ఇది పునర్జన్మ అంటూ మరికొంత మంది కామెంట్ లను పెడుతున్నారు.


ఇదిలా ఉండగా ఒక బాయ్ ఫ్రెండ్ చేసిన పనికి ఆమె షాక్ కు గురయ్యింది.


అమ్మాయి రోడ్డు మీద బ్యాగ్ వేసుకుని వెళ్తుంది. అప్పుడు ఒక ఆగంతకుడు ముఖం కన్పించకుండా.. వచ్చి ఆమె దగ్గర ఆగాడు. ఆమె తలపై ఒక్కటేసి.. చేతిలోని ఫోన్ ను లాక్కొని, కిందకు తోసేశాడు. దీంతో ఆమె షాక్ నకు గురైంది. వెంటనే కాపాడండి అని అరిచింది. ఈ క్రమంలో అక్కడున్నవారు,వెంటనే ఆగంతకుడికి వెంబడించారు. అతడిని పట్టుకుని, ఆమె దగ్గరకు తీసుకెళ్లారు.


అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. ఆ ఆగంతకుడు.. తన బాయ్ ఫ్రెండ్ అని తెలిసి యువతి షాక్ నకు గురైంది. ఇదేంపాడుపని అంటూ అతడిని తిట్టిపోసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వోర్నీ.. నువ్వేందిరా బాబు.. అమ్మాయిని ఇలా మోసం చేశావంటూ కామెంట్ లు పెడుతున్నారు.Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, Snake, VIRAL NEWS

ఉత్తమ కథలు