Home /News /trending /

KARATE TRAINER LETS ADORABLE LITTLE GIRL BEAT HIM INTERNET CALLS IT CUTE PAH

ఏకంగా కరాటే మాస్టర్ కే చుక్కలు చూపిస్తున్న చిన్నారి.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

తన మాస్టర్ తో కరాటే ప్రాక్టిస్ చేస్తున్న చిన్నారి

తన మాస్టర్ తో కరాటే ప్రాక్టిస్ చేస్తున్న చిన్నారి

Viral video: చిన్నారి తన ట్రైనర్ తో కలిసి కరాటే ప్రాక్టిస్ చేస్తుంది. ఆమె తన పంచ్ లతో మాస్టర్ కే చుక్కలు చూపిస్తూ అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India
మనలో చాలా మందికి ప్రత్యేకమైన ట్యాలెంట్ ఉంటుంది. చిన్నతనం నుంచి వాటిని గుర్తించి ప్రొత్సహిస్తే ఆయా రంగాలలో రాణిస్తుంటారు. కొందరు స్పోర్ట్స్ లలో తమదైన ట్యాలెంట్ ను కల్గి ఉంటారు. మరికొంత మంది ఏదైన చదువులు తమదైన సత్తాను కల్గి ఉంటారు. ఇంకొందరు.. పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం వంటి స్పెషల్ ట్యాలెంట్ ను కల్గి ఉంటారు. అయితే.. పెద్దలు వాటిని గుర్తించి ఆయా రంగాలలో ప్రొత్సహిస్తే, తమదైన గుర్తింపును సంపాదించుకుంటారు. ఈ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. గులాబీ రంగు దుస్తులు ధరించిన చిన్నారి.. బ్లూకలర్ దుస్తులు వేసుకున్న కరాటే మాస్టర్ తో తలపడింది. ఆమె.. తన మాస్టర్ పై పంచ్ లు కురిపిస్తుంది. అంతటితో ఆగకుండా.. మాస్టర్ ను కిందపడేసి అతని మీద ఎక్కి కూర్చుంది. అంతేకాకుండా.. వెంటనే పంచ్ లు కురిపిస్తు అతడికి చుక్కలు చూపించింది. చివరకు తన ట్రైనర్ పై పైచేయిసాధించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో చిన్నారికి ఆమె ట్రైనర్ మంచి మెళకువలు నేర్పిస్తు, ప్రాక్టిస్ చేయిస్తున్నాడు.





ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh)  జబల్ పూర్ లో వెరైటీ ఘటన జరిగింది.

అక్కడ ఉన్న ఆలయంలో జరిగిన దొంగ తనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి.. చొక్కా లేకుండా ఆలయంలోకి ప్రవేశించాడు. అతని తలకు మాస్క్ ధరించి ఉన్నాడు. అంతే కాకుండా.. లోపల గర్భగుడి ముందు దేవత దగ్గర చేరుకున్నాడు. అక్కడ అమ్మవారికి నమస్కరించాడు. ఆ తర్వాత.. విరాళాలు, విలువైన వస్తువులను తన బ్యాగులో వేసుకుని చోరీ చేశాడు. ఆగస్టు 5న ఈ ఘటన జరిగింది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఇది కాస్త వెలుగులోనికి వచ్చింది. పోలీసుల ప్రకారం.. స్థానికులు అమ్మవారికి సమర్పించిన రెండు పెద్ద గుడి గంటలు, ప్రసాదాలను కూడా దొంగ దొంగిలించాడు. వీడియో కనిపించిన తర్వాత ట్విట్టర్ వినియోగదారులకు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (Viral video) మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు