కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి దేవి అలంకరణ.. రూ. కోటికి పైగా విలువైన నోట్లతో..

గద్వాల్ లో శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారిని రూ .1,11,11,111 విలువైన కరెన్సీతో అలంకరించారు.

news18-telugu
Updated: October 26, 2020, 5:58 PM IST
కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి దేవి అలంకరణ.. రూ. కోటికి పైగా విలువైన నోట్లతో..
కన్యకాపరమేశ్వరీ అమ్మవారు
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. కరోనా పీడ పోవాలని భక్తులు అనేక చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయాల వద్ద నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు. అమ్మవారిని వివిధ రూపాలలో అలకరించి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గద్వాల్ లో శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారిని రూ .1,11,11,111 విలువైన కరెన్సీతో అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ధనలక్ష్మి రూపాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అయితే మూడేళ్ల క్రితం రూ .3,33,33,333 విలువైన కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. అయితే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో అమ్మవారిని గతంలో కన్నా తక్కువ కరెన్సీతో అలంకరించారు.


తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పున: ప్రారంభించింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి టీటీడీ సర్వదర్శన టోకెన్లను జారీ చేయడం ప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వీటిని జారీచేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మరసటి రోజు ఉదయం దర్శనం కల్పించనున్నారు. రోజుకు 3వేల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు తెల్లవారుజామునుంచే కౌంటర్‌ల వద్ద బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి పర్మిషన్ ఇవ్వనున్నారు.

ఇక, కరోనా లాక్‌డౌన్ అనంతరం జూన్ 11న భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ.. సర్వదర్శనం టోకెన్లు జారీచేసింది. అయితే తిరుపతిలో కరోనా విజృంభణతో సెప్టెంబర్ 6న సర్వదర్శనం టికెట్లను టీటీడీ నిలిపివేసింది. తాజాగా పరిస్థితుల్లో మార్పు రావడంతో.. భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీచేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు నెలన్నర తర్వాత టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం విజయదశమి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 26, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading