హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: కంగనా రనౌత్‌కు లైంగిక వేధింపులు.. అతడెవరో బయటపెట్టిన బాలీవుడ్ హీరోయిన్

Shocking: కంగనా రనౌత్‌కు లైంగిక వేధింపులు.. అతడెవరో బయటపెట్టిన బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ నటి కంగనా (ఫైల్)

బాలీవుడ్ నటి కంగనా (ఫైల్)

kangana Ranaut: కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ఈ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రెపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కంగనా మరోసారి వార్తలలో నిలిచారు.

Kangana Ranaut reveals she was molested in childhood: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సినిమాల్లో తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మణికర్ణిక, తలైవీ తదితర అనేక సినిమాలలో నటించారు. తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు, ఉద్ధవ్ ఠాక్రెపై కూడా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కూడా మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. ఒక వైపు సినిమాలలో నటిస్తునే.. మరోవైపు లాకప్ రియాల్టీ షోకు కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భిన్నమైన కాన్సెప్ట్ లతో ఈ షో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది. దీనిలో కంటెస్టెంట్ తాము.. ఎదుర్కొన్న అనేక సంఘటనలను హోస్ట్ లతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో ఒక మునాఫర్ అనే కంటెస్టెంట్ తాను..చిన్న తనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని హోస్ట్ లకు చెప్పుకున్నాడు. తెలిసిన వారే.. ఐదేళ్ల పాటు నరకం చూపించారని తన బాధను చెప్పుకున్నాడు. అయితే , ఈ క్రమంలో కంగనా రనౌత్ ఎమోషనల్ అయ్యారు. తాను చిన్న తనంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు.

కంగాన తన లైంగిక వేధింపుల గురించి చెబుతూ.. తాను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. తమ గ్రామంలోని ఒక బాలుడు.. తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతను తమకన్నా.. కేవలం నాలుగేళ్లు పెద్దవాడని తెలిపింది. ఇంటిదగ్గర స్నేహితులతో కలిసి ఆడుకునేటప్పుడు మధ్యలో వచ్చేవాడు. ఆ తర్వాత.. శరీరాన్ని తాకుతూ.. అసభ్యంగా ప్రవర్తించేవాడు.

ప్రైవేటు పార్ట్ లను తాకుతూ.. పైశాచికానందం పొందే వాడని తాను ఎదుర్కొన్న దారుణాన్ని బయటపెట్టింది. అంతే కాకుండా.. పక్కకు పిలిచి బట్టలు విప్పమని అడిగుతూ.. ఒళ్లంతా తడిమేవాడని వెల్లడించింది. అప్పుడు చిన్న తనంలో అతగాడి ఉద్దేష్యం తమకు తెలిసేది కాదని బాధపడింది. అప్పటి దారుణ ఘటనను ప్రస్తుతం మరోసారి కంగన గుర్తు చేసుకుంది.

First published:

Tags: Bollywood actor, Bollywood heroine, Bollywood news, Harassment, Kangana Ranaut

ఉత్తమ కథలు