సీఎం వ్యాఖ్యల భయంతోనే విధుల్లోకి.. ఆర్టీసీ డ్రైవర్ సంచలనం..

TSRTC Strike : విధుల్లో చేరడంపై కామారెడ్డి డిపో డ్రైవర్ హైమద్ మీడియాతో మాట్లాడారు. సమ్మె ప్రభావంతో జీతాలు రావడం లేదని, ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండటం వల్ల తాను విధులకు హాజరయ్యేందుకు వచ్చానని చెప్పాడు.

news18-telugu
Updated: November 3, 2019, 6:58 PM IST
సీఎం వ్యాఖ్యల భయంతోనే విధుల్లోకి.. ఆర్టీసీ డ్రైవర్ సంచలనం..
కామారెడ్డి డ్రైవర్ హైమద్
  • Share this:
ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 లోగా విధుల్లో చేరాలని, లేకపోతే ఆ తర్వాత ఎవ్వరినీ చేర్చుకోబోమని సీఎం కేసీఆర్ మంత్రి మండలి సమావేశానంతరం మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు ఉదయం కామారెడ్డి డిపోకు చెందిన సయ్యద్ హైమద్ డిపోకు వెళ్లి తాను విధుల్లో చేరతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు వివిధ డిపోల్లో కార్మికులు విధుల్లో చేరారు. వారిలో.. సిద్దిపేట డిపోలో పని చేస్తున్న కండక్టరు బాల విశ్వేశ్వరరావు, సిరిసిల్ల డిపో మెకానిక్ K. శ్రీనివాస్, హయత్ నగర్ 2 డిపో డ్రైవర్ గౌస్, మిర్యాలగూడ డిపోకు చెందిన కండక్టర్ ఎస్.కె.ఎం.వలి డ్యూటీలో చేరేందుకు వచ్చారు. భద్రాచలం డిపోకు చెందిన శేషాద్రి అనే కార్మికుడు కూడా విధుల్లో చేరడానికి వస్తే, యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. కళ్లల్లో కారంపొడి పోసి వెనక్కి తిప్పి పంపారు. అయితే.. విధుల్లో చేరడంపై కామారెడ్డి డిపో డ్రైవర్ హైమద్ మీడియాతో మాట్లాడారు. సమ్మె ప్రభావంతో జీతాలు రావడం లేదని, ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండటం వల్ల తాను విధులకు హాజరయ్యేందుకు వచ్చానని చెప్పాడు.

‘రెండు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల ముందు సమ్మె చేస్తే లాభం ఉండేది. పండగల ముందు సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు’ అని హైమద్ తెలిపాడు. విధుల్లో చేరాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే.. మంత్రి మండలి సమావేశానంతరం మీడియాతో సీఎం చేసిన వ్యాఖ్యలతో తనలో భయం ఏర్పడిందని వెల్లడించాడు. అందుకే తన సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు వచ్చానని స్పష్టం చేశాడు. కాగా, విధుల్లో చేరవద్దని.. డిమాండ్లు సాధించుకుందామని హైమద్ కుటుంబ సభ్యులకు కొంత మంది ఆర్టీసీ కార్మికులు సర్ది చెప్పారు. అయితే.. వారు వినలేదని సమాచారం. మరోవైపు.. హైమద్ నిర్ణయంతో పల్లెబాట నిర్ణయాన్ని కార్మికులు రద్దు చేసుకున్నారు. 

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ పిలుపు.. విధుల్లో చేరిన డ్రైవర్..
First published: November 3, 2019, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading