హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Kamala Harris : డెమొక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్...

Kamala Harris : డెమొక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్...

డెమొక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్...  (credit - twitter - Manny Funes)

డెమొక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్... (credit - twitter - Manny Funes)

Kamala Harris : కమలా హారి‌స్‌ను... తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా... జో బిడెన్ మంగళవారం ప్రకటించారు. మరి ఆమెకూ, భారత దేశానికీ ఉన్న సంబంధమేంటి? ఆమె పేరులో భారతీయతకు అర్థమేంటి?

Kamala Harris : ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అయిన డొనాల్డ్ ట్రంప్‌కి డెమొక్రాట్ల తరపున గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న జో బిడెన్... క్రమంగా తన నెక్ట్స్ పదవుల అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. కాలిఫోర్నియా హై ప్రొఫైల్ సెనెటర్ అయిన కమలా హారిస్ పేరును ఉపాధ్యక్ష అభ్యర్థిగా మంగళవారం ప్రకటించారు. ఆ పదవికి ఎవరిని పోటీలో నిలబెట్టాలా అని జో... నెల పాటూ వెతికి వెతికి... చివరకు కమలా హారిస్ పర్ఫెక్ట్ అని భావించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి షాకిచ్చే రేంజ్‌లో కమలా హారిస్ స్పీచ్‌లు ఇవ్వగలరనీ, ప్రజలను ఆకట్టుకోగలరని జో లెక్కలేశారు. నిజానికి 77 ఏళ్ల బిడెన్ వంద శాతం కరెక్టు పర్సన్‌ని ఎంపిక చేశారనుకోవాలి. ఎందుకంటే... కమలా హారిస్‌కి... అమెరికాలోని బెస్ట్ నేతల్లో ఒకరిగా పేరుంది. పైగా... ఆమె ఏ విషయంలోనూ వెనకడుగు వెయ్యరు. ధైర్యం ప్రదర్శించడంలో ఆమెకు తిరుగులేని ట్రాక్ ఉంది. అందుకే ఆమె పేరును ప్రకటించడం తనకెంతో గౌరవంగా, గర్వంగా ఉందన్నారు బిడెన్. ఇక తన ఎన్నికల ప్రచారం మరింత దూసుకుపోవడం ఖాయమన్నారు.

కరోనా కారణంగా... ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అమెరికా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో ట్రంప్ మొదటి నుంచి జోరుగానే ఉన్నారు. అంతే దీటుగా జో బిడెన్ కూడా... సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. కమలా హారిస్ కూడా అంతే. టెక్నాలజీని బాగా వాడగలరు. జో... తన పేరును ప్రకటించిన కాసేపటికే... ఆమె ట్వీట్ చేశారు. తన పేరను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. బిడెన్‌ను తమ కమాండర్ ఇన్ చీఫ్‌గా మార్చేందుకు ఏం చెయ్యాలో అంతా చేస్తామన్నారు.

బిడెన్, కమలా హారిస్ గెలిస్తే... 55 ఏళ్ల ఆమె... ఆటోమేటిక్‌గా... 2024 లేదా 2028లో డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థి కాగలరు. ఇది పెద్ద సవాలే అయినా... ఇలాంటి ఎన్నో సవాళ్లను ఇప్పటివరకూ ఆమె ఎదుర్కొని విజయవంతమైన నేతగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు విదేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి జమైకాకి చెందిన వారు. తండ్రి ఇండియన్. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి (Black Woman) మహిళ ఆమె. అంతేకాదు... అమెరికా సెనేట్‌కి ఎన్నికైన తొలి సౌత్ ఆసియన్ కూడా ఆమే.

తమిళనాడు... చెన్నైలో... అయినవారితో... కమలా హారిస్

నిజానికి 2019 వరకూ డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పేరే అధ్యక్ష రేసులో ఉంది. 2019 డిసెంబర్‌లో ఆమె రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత మార్చిలో జో బిడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఐతే... ఈ పోటీలో ఏనాడూ బిడెన్ ఆమెను తక్కువ చెయ్యలేదు. ఆమె చాలా తెలివైన వారనీ, ఫస్ట్ రేట్ అభ్యర్థి నీ, నిజమైన పోటీదారు అని మెచ్చుకున్నారు. ఇప్పటికే ట్రంప్ వ్యవహార శైలిపై విమర్శలున్నాయి. ముఖ్యంగా కరోనాను ఆయన సరిగా కట్టడి చేయలేకపోతున్నారనే వాదన ఉంది. అందువల్ల ప్రజలు మార్పు కోరుకుంటే జో బిడెన్ టీమ్ అమెరికాను ఏలేయడం గ్యారెంటీ.

First published:

Tags: Kamala Harris, US Elections 2020

ఉత్తమ కథలు