Kaavan: ఎట్టకేలకు తోడు దొరికింది.. పాక్ ఏనుగుకు కాంబోడియాలో జోడీ

శ్రీలంక నుంచి తెచ్చిన ఏనుగు (elephant) దశాబ్దాలుగా పాకిస్థాన్ (Pakistan) ప్రజలను అలరిస్తోంది. దాని పేరు కావన్ (Kaavan). 35 ఏళ్ల క్రితం గున్న ఏనుగైన కావన్ ను పాక్ కు గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీలంక.

news18-telugu
Updated: November 30, 2020, 4:26 PM IST
Kaavan: ఎట్టకేలకు తోడు దొరికింది.. పాక్ ఏనుగుకు కాంబోడియాలో జోడీ
Elephant Kaavan((Image credits: AFP)
  • Share this:
శ్రీలంక నుంచి తెచ్చిన ఏనుగు (elephant) దశాబ్దాలుగా పాకిస్థాన్ (Pakistan) ప్రజలను అలరిస్తోంది. దాని పేరు కావన్ (Kaavan). 35 ఏళ్ల క్రితం గున్న ఏనుగైన కావన్ ను పాక్ కు గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీలంక. 2012లో కావన్ తోడైన సహేలీ మరణించింది. ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన ఏనుగు మరణించగా ప్రపంచంలో ఒంటరిగా నివసిస్తున్న ఏకైక ఏనుగుగా (lonely elephant) కావన్ చరిత్ర సృష్టించడంతో, అంతర్జాతీయంగా దీని పేరు మారుమోగిపోయింది. ఇలా సుమారు 8 ఏళ్లపాటు జీవనం గడిపిన కావన్ కు ప్రస్తుతం 36 ఏళ్లు. ఇస్లామాబాద్ లోని ఓ చిన్న జూ నుంచి ఇప్పుడు దీన్ని కాంబోడియాకు తరలించాలంటూ హైకోర్టు తుది తీర్పుతో కావన్ ఒంటరితనానికి ఫుల్ స్టాప్ పడింది.

ఏనుగు కోసం ఉద్యమం

ఒంటరిగా ఉండలేకపోవటంతో దీని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఎమోషనల్ గా వీక్ అయిన ఈ ఏనుగు, సరిగా తిండి తినక, శారీరకంగానూ పటుత్వం కోల్పోయింది. దీంతో పశువైద్యులు ఈ ఏనుగు బలహీనపడిందని, చెప్పటంతో అంతర్జాతీయ సమాజం ఈ ఏనుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. జంతు హక్కుల ఉద్యమకారులు ఈ ఏనుగును కాపాడాలంటూ ఉద్యమించారు. దీంతో ఈ ఏనుగుకు ఓ జంట దొరికేందుకు అనువుగా ఉండేలా కాంబోడియా అడవులకు పంపించేస్తున్నట్టు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసినట్టు జియో న్యూస్ వెల్లడించింది. జూ (Zoo) నుంచి ఈ ఏనుగును ఇస్లామాబాద్ (Islamabad) విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి ఏనుగు కోసం ప్రత్యేకంగా తెప్పించిన రష్యన్ స్పెషల్ జెట్ లో కాంబోడియాకు తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సహేలీ మరణంతో కావన్ కు గుండె పగిలినంత పనైందని, అప్పటి నుంచి దీని ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ప్రస్తుతం దీని బరువు 5 టన్నులు. ఇస్లామాబాద్ హైకోర్టు మేలోనే స్థానిక జూను మూసివేయాలని, ఈ జంతుప్రదర్శన శాలలో జంతువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని పేర్కొంది. జూలైలో కావన్ ఏనుగును కాంబోడియా తరలించేందుకు కోర్టు అంగీకరించింది. అమెరికన్ సింగర్ షేర్ (Cher) ఈ ఏనుగును కాపాడాలంటూ, వేరే దేశానికి తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కావన్ ను కాంబోడియా (Cambodia) కు తరలించే నిర్ణయం తీసుకున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

అంతర్జాతీయ జంతు సంరక్షక సంస్థ నాన్-హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ (Non-human Rights Project) ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేసింది. జంతు హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్న సంస్థగా NhRP పేరుగాంచింది. కాగా పాకిస్థాన్ లో మానవ హక్కులకే దిక్కులేకుండా పోతుంటే జంతు హక్కులకు ఎక్కడ అవకాశం ఉంటుందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పాక్ సంపన్న కుటుంబాలన్నీ విదేశాలకు తరలిపోయి, అక్కడే తాము కోరుకున్న సంతోషకరమైన జీవితం గడుపుతూ, తమ పిల్లలను కూడా విదేశాల్లోనే శాశ్వతంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాయాది దేశంలో నామమాత్రంగా ఉన్న జూ, వాటిలోని జంతువుల సంరక్షణపై ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు.
Published by: Sumanth Kanukula
First published: November 30, 2020, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading