అరటిపళ్లకు జీఎస్టీ.. స్టార్ హోటల్‌పై రూ.25వేలు జరిమానా

జీఎస్టీ పరిధిలోని లేని అరటిపళ్లకు ట్యాక్స్ విధించింది స్టార్ హోటల్.

news18-telugu
Updated: July 27, 2019, 10:28 PM IST
అరటిపళ్లకు జీఎస్టీ.. స్టార్ హోటల్‌పై రూ.25వేలు జరిమానా
రెండు అరటిపండ్లు రూ.442
  • Share this:
రెండు అరటి పళ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్‌పై ఎక్సైజ్- పన్నుల శాఖ రూ.25వేల జరిమానా విధించింది. అరటి పళ్లు జీఎస్టీ పరిధిలో లేవు. వాటికి జీఎస్టీ వేయడంపై ఈ జరిమానా వేసింది. చండీగఢ్‌లో ఉన్ జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ రెండు అరటిపళ్లు తిన్నాడు. దానికి ఆ హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలసి రూ.442.50 బిల్లు వేసింది. దీంతో రాహుల్ బోస్ షాక్‌కి గురయ్యాడు. ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. హోటల్ పేరు చెడిపోయే పరిస్థితి రావడంతో మారియట్ యాజమాన్యం స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. అయితే, ఆ బిల్లును చూసిన ఎక్సైజ్ పన్నుల శాఖ.. అరటి పళ్లకు కూడా జీఎస్టీ వేసినట్టు గుర్తించింది. 9శాతం జీఎస్టీ వేసినట్టు బిల్లులో గుర్తించారు. దీంతో హోటల్‌పై రూ.25వేల జరిమానా విధించారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: July 27, 2019, 10:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading