ఇండియా టాప్ ట్రెండింగ్‌లో కర్నూలు బాలిక కేసు.. ఇంతకీ ఎవరీమె?, ఏం జరిగింది?

#JusticeForSugaliPreethi అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది

news18-telugu
Updated: December 8, 2019, 6:51 PM IST
ఇండియా టాప్ ట్రెండింగ్‌లో కర్నూలు బాలిక కేసు.. ఇంతకీ ఎవరీమె?, ఏం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
#JusticeForSugaliPreethi అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఓ దశలో వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లో కూడా నడించింది. ప్రస్తుతం భారత్‌లో టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఇది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో టాప్‌లో ఉంది.

అసలు ఎవరీమె? కర్నూలుకు చెందిన 14 ఏళ్ల బాలిక. టీడీపీ నేత వి.జనార్దన్ రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదివింది. 2017 ఆగస్ట్ 19న ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని స్కూల్ యాజమాన్యం చెప్పారు. అయితే, స్కూల్ అధినేత కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ధ్రువీకరించారు. కలెక్టర్ నియమించిన కమిటీ కూడా లైంగికదాడి తర్వాత హత్య జరిగినట్టు ధ్రువీకరించిందని కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు 23 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కేసు నీరుగారిపోయింది. అయితే, బాధితురాలి తల్లిదండ్రులు ఎన్‌హెచ్ఆర్సీని ఆశ్రయించంతో వారి ఆదేశాల ప్రకారం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కానీ, ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. రాజకీయ నేతల పాత్ర ఉన్న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దిశ హత్యాచారం మీద స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో మరోసారి పాత కేసు తెరపైకి వచ్చింది.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>