జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. RRR సినిమాలో కొత్త అవతారం..

Jr. NTR : రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో కొమురం భీం పాత్రలో తన నటనా కౌశల్యాన్ని మరోసారి ప్రదర్శించబోతున్నాడు. పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 4, 2019, 11:21 AM IST
జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. RRR సినిమాలో కొత్త అవతారం..
ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో తారక్‌, రామ్ చరణ్...
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 4, 2019, 11:21 AM IST
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో పాత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఓ వైపు హిట్ల మీద హిట్లు కొడుతూనే తన మార్కెట్‌ను కూడా అమాంతం పెంచేసుకున్నాడు. పలు వ్యాపార ప్రకటనలు, కొన్ని ఛానళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో కొమురం భీం పాత్రలో తన నటనా కౌశల్యాన్ని మరోసారి ప్రదర్శించబోతున్నాడు. పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకున్న యంగ్ టైగర్.. మిగిలిన భాషల్లోనూ తన స్టామినాను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. తారక్‌కు తమిళం, హిందీ భాషలపై మంచి పట్టుంది. ఆ మధ్య కన్నడలోనూ ఓ పాట పాడాడు. ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను రాజమౌళికి చెప్పగా.. ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...