హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

భువనేశ్వరి ఉదంతంలో సంచలనం -జగన్ సేనకు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ -వంశీ, నాని పేర్లు చెప్పకుండానే..

భువనేశ్వరి ఉదంతంలో సంచలనం -జగన్ సేనకు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ -వంశీ, నాని పేర్లు చెప్పకుండానే..

భువనేశ్వరి ఉదంతంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

భువనేశ్వరి ఉదంతంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ నలుగురు వైసీపీ నేతల పేర్లను నందమూరి కుటుంబీకులు ప్రస్తావించారు. అందులో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తులు. దీంతోపాటు టీడీపీ పగ్గాలు జూనియరే చెప్పాలనే డిమాండ్ల నేపథ్యంలో భువనేశ్వరి ఉదంతంపై ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్కారుపై తొలిసారి..

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly ) లో చోటుచేసుకున్న ఘటనలపై, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)  సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల ఉదంతంపై నందమూరి వారసుడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. భువనేశ్వరిని బాదపెట్టిన వైసీపీ నేతలుగా నందమూరి కుటుంబీకులు ఆరోపించిన పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ కు ఆప్తులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా ఉండటంతో ఆయన ప్రతిస్పందనకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, దూషణకు గురైన బాధితురాలి కుటుంబీకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగానే తానీ మాటలు చెబుతున్నానంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జూనియర్. టీడీపీకి సారధ్యం వహించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు, అభిమానులు తరచూ ఆందోళనలకు దిగుతోన్న దరిమిలా నారా భువనేశ్వరి ఉదంతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి స్పందించారు. అదే సమయంలో తన ఆప్తులు వంశీ, నాని పేర్లను కూడా ఆయన ప్రస్తావించలేదు.

ఆ నలుగురు వైసీపీ నేతలపై..

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ నందమూరి కుటుంబీకులు ఇవాళ కొందరు నేతల పేర్లను ప్రస్తావించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో శనివారం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, భువనేశ్వరి మరో సోదరుడు రామకృష్ణ.. వైసీపీ నేతలైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీల పేర్లను ప్రస్తావించారు. ఆ నలుగురూ భువనేశ్వరిని అవమానించేలా మాట్లాడారని, ఇకపైనా ఇది కొనసాగితే విశ్వరూపం చూపిస్తామని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ మరోఅడుగు ముందుకేసి.. ఇంకోసారి తన ఫ్యామిలీ జోలికొస్తే మెడలు విరగ్గొడతానని వైసీపీ నేతలను హెచ్చరించారు. వీరి ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు. భువనేశ్వరి ఉదంతంలో జగన్ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపుడుతూ సాగిన ఆ వీడియోలో జూనియర్ పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

డిప్రెషన్‌లో నారా భువనేశ్వరి! -అవమానాన్ని తట్టుకోలేక -ఆ వైసీపీ నేతలు ఎవరంటే: నందమూరి కుటుంబం


అరాచక పాలనకు నాంది..

‘అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజాసమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యమంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పానలకు నాంది పలుకుతుంది. స్త్రీజాతిని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అందించాలి. అంతేకానీ,


నారా భువనేశ్వరిపై దారుణ కామెంట్లు.. స్పీకర్ తమ్మినేని చర్యలు -చంద్రబాబుకు కౌంటర్ -లోకేశ్ పుట్టుకపై..!!


ఫ్యామిలీ వ్యక్తిగా కాదు..

మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి, ఇదే రాబోయే తరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పుు. ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందినవాడినిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమజ్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను..’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు.

First published:

Tags: AP Assembly, Chandrababu Naidu, Jr ntr, Nandamuri Family, Nara Bhuvaneshwari, NTR, TDP, Ysrcp

ఉత్తమ కథలు