బీజేపీకి కొత్త సారథి... అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డా

J P Nadda : జగత్ ప్రకాష్ నడ్డా... ఇలాకంటే... జేపీ నడ్డా అంటే మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే అదే పేరు మనం రెగ్యులర్‌గా వింటున్నాం. మరి ఆయన బీజేపీ అధ్యక్షుడు అయిపోయారు. ఆయన ప్రత్యేకతలేంటో, ప్రొఫైలేంటో తెలుసుకుంటే మంచిదే...

news18-telugu
Updated: January 20, 2020, 2:42 PM IST
బీజేపీకి కొత్త సారథి... అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డా
నేడు బీజేపీకి కొత్త సారథి... అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియామకం...
  • Share this:
J P Nadda : బీజేపీకి అధ్యక్షుడు కావడమంటే మాటలా... పైగా ఇప్పుడా పార్టీ దేశవ్యాప్తంగా రెండోసారి అధికారంలోకి వచ్చి దుమ్మురేపుతోంది (కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ). మరి అలాంటి పార్టీ పగ్గాలు అందుకునే ఛాన్స్ అందరికీ రాదు. ఆ ఛాన్స్ ఇన్నాళ్లూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డా (59)కి దక్కింది. నడ్డా బీజేపీ అధ్యక్షుడు అయ్యేందుకు ఎలాంటి సమస్యలూ రాలేదు. పార్టీలో పెద్ద తలకాయలన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అందువల్ల ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. రూల్ ప్రకారం... ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల మధ్య అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ల దాఖలు జరిగింది. నడ్డా తప్ప ఎవరూ నామినేషన్ వెయ్యలేదు. ఫలితంగా మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఫలితంగా ఇప్పటివరకూ అమిత్ షా చేతిలో ఉన్న పగ్గాలు... నడ్డా చేతిలోకి వెళ్లాయి. ఇప్పుడు అమిత్ షా పూర్తిగా కేంద్ర హోంమంత్రి పదవిపై ఫోకస్ పెట్టబోతున్నారు. నడ్డా పార్టీ సంగతి చూసుకోబోతున్నారు.

నిజానికి నడ్డా ఎన్నిక ఇప్పుడు నిర్ణయించింది కాదు. 2019 జులైలో కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్)గా నియమించిన రోజే జరిగిపోయింది. బీజేపీ రూల్స్ ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిశాక అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అందుకే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టారు.

నడ్డాకు అంత సీన్ ఉందా? : ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం సత్తా ఏంటో రెండుసార్లు జరిగిన ఎన్నికలతో బయటపడింది. ఇప్పుడు షా ప్లేస్‌లో వచ్చే నడ్డాకు... 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఆయనకు అంత సీన్ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి బీజేపీ వర్గాలు చెబుతున్నది ఒకటే. మీరే చూస్తారుగా అని. ఎందుకంటే నడ్డా ఆషామాషీ నేత కాదు. నరేంద్ర మోదీ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. పార్టీలో చాలా హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతేడాది జులైలో బీజేపీ వర్కింగ్​ప్రెసిడెంట్​ అయ్యారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు పార్టీ ఇన్ఛార్జిగా చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ... ఎస్పీ, బీఎస్పీ కూటమిని ఓడించి 80 ఎంపీ సీట్లలో 62 గెలుచుకుంది. అది చాలు నడ్డా కెపాసిటీ ఏంటో చెప్పడానికి. పార్టీ పార్లమెంటరీ బోర్డ్​ మెంబర్‌గా కూడా ఆయన పనిచేశారు. అందుకే... బీజేపీ ఏకగ్రీవంగా నడ్డాకు స్వాగతం పలుకుతోంది. సో... 2024 ఎన్నికలు కాస్త భిన్నంగానే ఉంటాయనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: January 20, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading