• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • JOGGERS IN VADODARA BURST CRACKERS TO CELEBRATE OPENING OF PARKS

జాగర్స్ మూర్ఖపు చర్య.. కరోనా ఇంకా అంతం కాలేందంటున్న నెటిజన్లు

జాగర్స్ మూర్ఖపు చర్య.. కరోనా ఇంకా అంతం కాలేందంటున్న నెటిజన్లు

బాణాసంచా కాల్చుతున్న జాగర్స్

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే కొందరు మాత్రం  ఇవేమీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

  • Share this:
    భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం నిబంధన పాటించాలని వైద్యులు నిత్యం హెచ్చరిస్తూనే  ఉన్నారు. అయితే కొందరు మాత్రం  ఇవేమీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని వడోదరాలో కొందరు ఫిట్‌నెస్ ఔత్సాహికులు పార్క్‌లు తిరిగి ప్రారంభం కావడంతో.. సంబరాలు చేసుకున్నారు. జాగర్స్, మార్నింగ్ వాకర్స్ కలిసి సాయాజీ బాగ్ గార్డెన్ వద్ద బాణాసంచా పేల్చారు. కరోనా నిబంధనలు పాటించకుండా వారి ఇష్టారీతిన వ్యవహరించారు.



    ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కరోనా నిబంధనలకు విరుద్ధంగా వారు వ్యవహరించిన తీరుపై నెటిజనులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ.. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుందనే విషయాన్ని మరచిపోకూడదని గుర్తుచేస్తున్నారు. వాళ్లు తమ మూర్ఖపు చర్య ద్వారా కరోనాను తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

    కాగా, గతంలో కూడా పలువురు కరోనా నిబంధనలను ఉల్లంఘించి ఇటువంటి మూర్ఖపు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. జూలైలో దేశ రాజధాని ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో కరోనా ఉందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఏడుగురు అమ్మాయిలతో సహా 31 మందిని అరెస్ట్ చేశారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు