• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • JOB OFFER FOR FAT PEOPLE JAPAN COMPANY RECRUITING FAT PEOPLE AND OFFERS RS 1300 SALARY FOR 1 HR GH SK

Jobs For Fat People: లావుగా ఉన్న వాళ్లకు అదిరిపోయే ఆఫర్.. గంటకు రూ.1300 జీతంతో ఉద్యోగం..

ప్రతీకాత్మక చిత్రం

18 ఏళ్లు దాటి.. 100 కిలోలకు బరువు ఉంటే చాలు.. అదిరిపోయే ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ ఎక్కడ ఇస్తున్నారు? ఏం చేయాలి? వంటి ఆసక్తిక వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
లావుగా ఉన్నవారిని అందరూ చులకనగా చూస్తారు. ఏ పనీ చేతకాదని.. కూర్చొని తినడం తప్ప ఇంకేమీ చేయలేరని ఎగతాళి చేస్తుంటారు. జంబో..సుమో.. మోటు అంటూ ఆటపట్టింస్తుంటారు. కానీ అక్కడ మాత్రం లావుగా ఉన్న వారికి అదిరిపోయే ఉద్యోగాలు వస్తున్నాయి. 100 కిలోలకు పైగా బరువు ఉన్న వారిని ఎంపిక చేసి.. అధిక జీతానికి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఐతే ఇది మన ఇండియాలో కాదు. జపాన్‌లో..! అక్కడ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. జపాన్‌ వాళ్ల ఆలోచనలు కొత్తగా ఉంటాయని తెలుసు కానీ.. మరి ఇంత కొత్తగా ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోయేలా చేసింది ఓ సంస్థ. ఏకంగా మనుషులనే అద్దెకు ఇస్తోంది ఒక కంపెనీ. అంతే కాదు.. వాళ్లు లావుగా ఉండాలని రూల్‌ పెడుతోంది. దీని కథేంటో చదివేయండి.

18 ఏళ్లు దాటి, వంద కిలోల బరువు పైబడి ఉన్నారా... అయితే మీకు ఉద్యోగం రెడీ. జీతం గంటకు 18 డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం 1300 రూపాయలు. జపాన్‌లో ప్లస్‌ సైజ్‌ఫ్యాషన్‌ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న బ్లిస్‌కు చెందిన ‘క్విజల్లా’నే ఈ కొత్త సర్వీసును తీసుకొచ్చింది. దీని పేరు డెబుకరీ. తమ బ్రాండ్‌ ప్రచారం కోసం ప్లస్‌ సైజ్‌ మోడల్స్‌ దొరకకపోవడంతో బ్లిస్‌ ఈ తరహాలో ఆలోచన చేశారని కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది.

డెబుకరీ సంస్థను 2017లో 45 మందితో బ్లిస్‌ ఏర్పాటు చేశారు. వాళ్లంతా క్విజల్లా వినియోగదారులే. డెబుకరీ కోసం బ్లిస్‌ ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు చేరారు. అయితే బ్లిస్‌ ఈ ఆలోచనను ఎక్స్‌పాండ్‌ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ దగ్గరున్నమోడళ్లను రెంట్‌కి ఇస్తామని ప్రకటించారు. ఒక్కో మోడల్‌ కోసం గంటకు 2000 యెన్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు గంటలకు సుమారు 1300 రూపాయలు.

ఈ లావుపాటి మోడల్స్‌తో ఏం పని ఉంటుంది అనేగా డౌట్‌. బ్లిస్‌ లాగే ఎవరైనా ప్లస్‌ సైజ్‌ ఫ్యాషన్‌ నిర్వహించేవాళ్లు వీళ్లను రెంట్‌కి తీసుకోవచ్చు. అది కాకుండా డైట్‌ ప్లాన్‌కు సంబంధించి షోస్‌, యాడ్స్‌, ప్రోగ్రామ్స్‌ చేసేవాళ్లు కూడా వీళ్లను అద్దెకు తీసుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఈ సంస్థ పిలుపునకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది. జపాన్‌లోని వివిధ నగరాల నుంచి రోజూ అప్లికేషన్లు వస్తున్నాయని డెబుకరీ చెబుతోంది.

డెబుకరీలో చేరాలంటే రెండు అర్హతలు ఉండాలి. ఒకటి ఆ వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండాలి. రెండోది 100 కిలోలకుపైగా బరువు ఉండాలి. వీళ్లను అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే 2000 యెన్‌ల డబ్బును మెడల్స్‌కే ఇచ్చేస్తున్నారు. సంస్థ నుంచి వచ్చే కమిషన్‌ను మాత్రమే డెబుకరీ తీసుకుంటున్నారు. టోక్యో, ఒసాకా, ఐచీ లాంటి జపాన్‌కు చెందిన నగరాల్లో ప్రస్తుతం డెబుకరీ సేవలు అందిస్తోంది. త్వరలో మిగిలిన ప్రాంతాలకు ఈ సర్వీసులు పెంచుతారట. ఇలాంటి ఉద్యోగ ఆఫర్ మన వద్ద కూడా ఉంటే.. ఎంత మంది దరఖాస్తు చేసేవారో కదా..!
Published by:Shiva Kumar Addula
First published: