హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

AP EAMCET: నేడే ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

AP EAMCET: నేడే ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP EAMCET Results: అధికారిక వెబ్‌సైట్‌లో ఏపీ ఎంసెట్‌ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంసెట్‌ ఫలితాల్లో తీవ్ర జాప్యం జరిగింది.

  ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయరాజు ఎంసెట్‌ ర్యాంకుల సీడీని తాడేపల్లిలోని కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ నిర్వహించారు. ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 2,82,901 మంది పరీక్ష రాశారు. ఫలితాలు విడుదలవగానే అభ్యర్థుల సెల్‌ఫోన్లకు ర్యాంకులను మెసేజ్ ద్వారా పంపిస్తారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంసెట్‌ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంసెట్‌ ఫలితాల్లో తీవ్ర జాప్యం జరిగింది. గత ఏడాది మే 3నే ఫలితాలు విడుదల చేశారు. ఈసారి మే 18 తేదీన ఫలితాలను విడుదల చేయాలని భావించినా ఆ తర్వాత ఫలితాల విడుదలను వాయిదా వేశారు. దాదాపు 36వేల మందికి పైగా తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారు. వీరికి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్‌ మార్కుల వెయిటేజీ అవసరం కానుంది. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది.


  ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో 25% వెయిటేజీ ఉంది. మొత్తం 2,82,901 మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,85,711 మంది హాజరు కాగా.. వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 81,916 మంది హాజరయ్యారు. జేఎన్‌టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది.


  ఏపీ ఎంసెట్ ఫలితాలు ఇలా చూసుకోవాలి..


  1. అధికారిక లింక్ www.sche.ap.gov.in ఓపెన్ చేయాలి.

  2. ఏపీ ఎంసెట్-19పై క్లిక్ చేయండి

  3. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2019పై క్లిక్ చేయండి

  4. మీ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరును నమోదు చేయండి

  5. సబ్మిట్ నొక్కగానే.. మీ రిజల్ట్ ప్రత్యక్షం అవుతుంది.

  6. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.

  7.విద్యార్థులు http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు..

  First published:

  Tags: AP EAMCET 2019, AP News

  ఉత్తమ కథలు