Home /News /trending /

JHARKHAND MLAS MUD WATER BATH OVER POOR NATIONAL HIGHWAY PAH

వామ్మో... బురద నీటిలో స్నానం చేసిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

బురదలో మహిళా ఎమ్మెల్యే స్నానం

బురదలో మహిళా ఎమ్మెల్యే స్నానం

Jharkhand: కుండ పోత వర్షానికి రోడ్లన్ని గుంతలుగా మారిపోయాయి. దీంతో మహిళా ఎమ్మెల్యే అదే బురదలో రోడ్డుపైన స్నానం చేస్తున్న ఘటన తెగ వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Jharkhand, India
కొన్నిసార్లు అధికారులు రోడ్లు వేయడానికి కాంట్రాక్ట్ ఇస్తుంటారు. కాంట్రాక్టర్లు అధికారులు, రాజకీయ నాయకులకు తమ వంతుగా కొంత డబ్బులను లంచంగా ఇస్తుంటారు. ఈ క్రమంలో.. వారు సరైన నాణ్యత లేని మెటీరియల్ ను ఉపయోగిస్తుంటారు. దీంతో కొద్ది పాటి వర్షానికే రోడ్లపైన కంకర తెలుతుంది. రోడ్లన్ని గుంతలుగా మారిపోతుంటాయి. ఈ క్రమంలో మరల దానిపైన ప్యాచ్ వర్క్ చేస్తుంటారు. దీంతో ప్రజాధనం పూర్తిగా వెస్ట్ అవుతుంది. దీంతో ప్రజలు గుంతలు పడిన రోడ్లపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో అనేక విధాలుగా తమ నిరసనలను తెలియజేస్తుంటారు. కొన్నిసార్లు వీరితో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన స్టైల్ లో నిరసనలోన పాల్గొంటుంటారు.ఈ కోవకు చెందిన వీడియో వైరల్ గా (Viral video) మారింది. పూర్తి వివరాలు.. జార్ఖండ్ లో (Jharkhand) కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో.. గొడ్డా జిల్లా అంతటా రోడ్లన్ని అధ్వన్నంగా మారిపోయాయి. రోడ్లను చూసి ఎక్కడిక్కడ ప్రజలు నాయకులను నిలదీస్తున్నారు. అయితే.. మహాగామా శాసన సభ్యురాలు దీపికా పాండే సింగ్ కూడా అధికార పార్టీపై తనదైన శైలీలో నిరసన వ్యక్తం చేశారు. వర్షం నీటితో నిండిలో గుంతలో కూర్చున్నారు. అంతే కాకుండా.. అదే నీళ్లతో స్నానం కూడా చేశారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ప్రత్యేకంగా ఫండ్స్ ను కేటాయించి యుద్ద ప్రాతిపదికన రోడ్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా కేరళకు (Kerala) చెందిన ఒక నవవధువు తన పెళ్లి ఫోటో షూట్ కోసం గుంతలు పడిన రోడ్లను ఎంచుకుంది. ఆమె అందంగా రెడీ అయ్యి.. గుంతలు పడిన రోడ్లగుండా నడుచుకుంటూ వస్తుంది. కాగా, ఆ ప్రాంతంలో రోడ్లన్ని వర్షం పడి పూర్తిగా గుంతలుగా మారిపోయాయి. కనీసం యువతి సరిగ్గా నడవలేక ఇబ్బందులు పడుతుంది. కనీసం ఈ రకంగా అయిన.. తాము ఎదుర్కొంటున్న బాధలు అధికారులు, నాయకులవరకు వెళ్తుందని నవవధువు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. దీనితో యువతి తన పెళ్లి ఫోటోషూట్ తో పాటు.. సమాజం పట్ల తన సామాజిక బాధ్యతను కూడా సోషల్ మీడియాలో అందరికి తెలిసేలా చేసింది. కనీసం దీన్ని చూసైన అధికారులు స్పందిస్తారేమోనని నవవధువు భావించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వధువు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. మరికొందరు సమాజం పట్ల ఆమె చూపిన బాధ్యతను శెభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Jharkhand, Viral Video

తదుపరి వార్తలు