JHARKHAND DISTRICT PUBLIC SCHOOL PRINCIPAL ATTENDER FIGHTING VIDEO GOES VIRAL SNR
Silly fighting: పాపం స్కూల్ ప్రిన్సిపాల్‌ని ఒక ప్యూన్ ఎలా కొట్టాడో ఈ వీడియోలో చూడండి..
Photo Credit:Youtube
Jharkhand:జార్ఖాండ్‌లోని జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్,అటెండర్ కొట్టుకున్నారు. చెప్పిన పని చేయకుండా తప్పించుకుంటున్నావని ప్రిన్సిపాల్ అడెండర్ని అనడంతో అతను కోపంతో ఊగిపోయి కర్రతో ప్రిన్సిపాల్‌ని కొట్టాడు. స్కూల్ ఆవరణలో ఉన్న మరికకొందరు ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఎక్కడైనా స్కూల్లో పిల్లలు కొట్టుకోవడం చూశాం. లేదంటే ఉపాధ్యాయులు గొడవపడటం విన్నాం. కాని జార్ఖాండ్(Jharkhand)లో మాత్రం స్కూల్ ప్రిన్సిపాల్ అందులో పనిచేస్తున్న అటెండర్ కొట్టుకున్నారు. ఒకరినొకరు నువ్వెంత అంటే నీ సంగతి తేలుస్తా అంటూ కర్రలు చేత్తో పట్టుకొని మరీ కొట్టుకున్నారు. కళ్ల అద్దాలు కిందపడేలా, షర్ట్లు నలిగిపోయేలా ఒకరి కాలర్ మరొకరు పట్టుకొని ఫైటింగ్(Fighting)చేసుకున్నారు. ప్యూన్(Attender)తో ప్రిన్సిపాల్(Principal)ఘర్షణ పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. పాలము (Palamu) జిల్లాలోని జిల్లేడు ప్రభుత్వ జిల్లా పాఠశాల (Government District School)లో ఈ ఫైటింగ్ సీన్ జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ కరుణ శంకర్ తివారీ(Karuna Shankar Tiwari), అటెండర్ హిమాన్షు తివారీ మధ్య జరిగిన గొడవ పడటానికి కారణం ఏమిటని తెలిసిన తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులే ఏం చర్యలు తీసుకోవాలో తెలియక తలలు పట్టుకున్నారు. గొడవపడుతున్న వీడియోలో ప్రిన్సిపాల్ కరుణా తివారీ ప్యూన్ హిమాన్షు తివారీ (Himanshu Tiwari) ని సరిగా పనిచేయడం లేదని...ఏ పని చెప్పినా తప్పించుకొని తిరుగుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో అటెండర్ హిమాన్షుకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే తన చేతిలో ఉన్న కర్ర పట్టుకొని ప్రిన్సిపాల్‌ని కొట్టాడు. అంతటితో ఆగకుండా ప్రిన్సిపాల్ కరుణా తివారీపై తీవ్ర విమర్శలు చేశాడు అటెండర్.
ప్రిన్సిపాల్‌తో ప్యూన్ ఫైటింగ్..
కరుణా తివారీ జిల్లా ప్రభుత్వ పాఠశాలకు తాజాగా ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ హోదాలో నియమించబడ్డారు. కొత్తగా వచ్చిన వ్యక్తికి నీకు ఏం తెలుసని తనను అంటున్నారని అటెండర్ ప్రిన్సిపాల్‌పై కోపం వెళ్లగక్కాడు. అందుకు ప్రిన్సిపాల్ నువ్వు ఆఫ్ట్రాల్ ప్యూన్వి ఎక్కువగా మాట్లాడవద్దనడంతో ప్యూన్ మరింత రెచ్చిపోయి ప్రిన్సిపాల్ చొక్కా పట్టుకున్నాడు. అతడ్ని నెట్టేశాడు. అటుపై నేను ప్యూన్ని కావచ్చు కాని నాకంటూ ఓ ప్రత్యేకమనైన హోదా ఉందని నీకులాగా ఇన్చార్జ్ హోదాలో ఎలాంటి బాధ్యత లేని పోస్ట్ కాదంటూ మరోసారి రెచ్చగొట్టాడు. ఈ విధంగా ఒకరినొకరు గట్టిగా తిట్టుకున్నారు. అటుపై నెట్టుకున్నారు. చివరకు చేరో కర్ర చేత్తో పట్టుకొని కొట్టుకున్నారు. ప్రిన్సిపాల్ స్థాయి ఉద్యోగితో గొడవపడటం, తన్నులు తినడం విడ్డూరంగా ఉందని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రిన్సిపాల్‌ని తప్పుపడుతున్నారు.
సిల్లీ టాపిక్‌లో గొడవ..
జిల్లా పాఠశాలలో వివాదాలు సర్వసాధారణంగా మారాయని దయచేసి చెప్పండి. విద్యాశాఖ తరపున కరుణ శంకర్ తివారీని ప్రిన్సిపాల్‌గా చేసినా.. ఆయన్ను ప్రిన్సిపాల్‌గా అంగీకరించేందుకు పాఠశాలలో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది సిద్ధంగా లేరు. జిల్లేడు పాఠశాలలో ఎక్కడ చూసినా రాజకీయం జరుగుతోంది.అందుకే జిల్లాపరిషత్ పాఠశాల పరిస్థితి అధ్వానంగా మారింది. వైరల్ వీడియోలో, ప్యూన్ హిమాన్షు తివారీ ప్రిన్సిపాల్‌ని తన స్థానంలో ఉండమని బెదిరించడం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా విద్యాశాఖాధికారి తరఫు వివరాలు తెలుసుకునేందుకు న్యూస్ 18 ప్రయత్నించినా ఆయనను సంప్రదించలేకపోయారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.