JHARKHAND CM HEMANT SOREN SALUTES CONGRESS MLA IN RANCHI VIDEO GOES VIRAL SNR
Video Viral: జార్ఖాండ్ సీఎం కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేకి పాదాభివందనం చేశాడు..ఇదే వీడియో
(Photo Credit:Youtube)
Video Viral:ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ లేడీ ఎమ్మెల్యే కాళ్లు మొక్కాడు. రాష్ట్ర, జిల్లా నాయకులతో మాట్లాడుతున్న సమయంలో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వందనం చేసిన వీడియో వైరల్ అవుతోంది.
రాజకీయ వేదికలు, కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు అంటే ఎక్కువగా ప్రత్యర్ధి పార్టీ నేతలపై విరుచుకుపడటం, వారిపై విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఊహించని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యర్ధులు తారసపడినప్పుడు ఒకరికి మరొకరు నమస్తారాలు చేసుకోవడం, కుర్చిల్లోంచి నిలబడి గౌరవం ఇవ్వడం సహజంగా చూస్తుంటాం. కాని జార్ఖాండ్(Jharkhand)లో జరిగిన ఓ వీడియో(Video) మాత్రం ఇప్పుడు విస్తృతంగా వైరల్(Viral)అవుతోంది. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి(Chief Minister)ఓ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే(Congress Women MLA)కి పాదాభివందనం చేయడంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
లేడీ ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన సీఎం..
రాష్ట్ర రాజధాని రాంచీలోని డీసీ కార్యాలయంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్..పార్టీ నాయకులతో మాట్లాడుతుండగా ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ రావడంతో సోరెన్ లేచి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెకు పాదాభివందం చేశారు. ఇప్పుడు ఈ వీడియోనే తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ..
జార్ఖాండ్‌లోని మందార్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈసందర్భంగా పార్టీల తరపున నామినేషన్ వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే రాంచీ డీసీ కార్యాలయంలో మహాకూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. మహాకూటమికి చెందిన పెద్ద నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ నామినేషన్లో పాల్గొన్నారు. జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నేతలంతా నామినేషన్ హాలు బయట కూర్చున్నారు. అదే సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన హోదాని సైతం పక్కనపెట్టి సంప్రదాయంగా మహిళ ఎమ్మెల్యేకి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె పాదాలకు వందనం చేశారు.
రాజకీయాల్లో ఇదంతా కామనే..
భారతీయ సంస్కృతిలో మహిళల్ని గౌరవించాలన్న మాట ప్రకారం సీఎం హేమంత్ సోరెన్ ఈవిధంగా తన గొప్ప తనాన్ని చాటుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రికి ఎడమవైపున కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ కూర్చున్నారు. ఆయన పక్కనే సుబోధ్‌కాంత్ సహాయ్ కూర్చున్నారు. ఆయన పక్కనే కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ కూర్చున్నారు. హేమంత్ సోరెన్ రాజేష్ ఠాకూర్‌తో మాట్లాడుతున్న సమయంలో దీపికా పాండే సింగ్ రావడంతో చేతులు జోడించి నమస్కరించి, ఆపై ఆమెకు పాదాభివందనం చేశారు. సీఎం వ్యవహార తీరు మర్యాదపూర్వకంగా నమస్కారం చేసినట్లుగా అక్కడున్న వాళ్లంతా భావించినప్పటికి..వీడియో చూస్తున్న సోషల్ మీడియా ఫాలోవర్స్ మాత్రం డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు అంటూ హేమంత్ సొరేన్పై కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.