HOME »NEWS »TRENDING »jharkand officer makes derogatory comments on doctors people become doctors to get good dowry he says ms

అందుకోసమే డాక్టర్ అవుతారట.. వైద్యులపై జార్ఖండ్ ఉన్నతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

అందుకోసమే డాక్టర్ అవుతారట.. వైద్యులపై జార్ఖండ్ ఉన్నతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్లు సేవ చేయడానికి కాదు.. వారి స్టేటస్ పెంచుకుని అందుకు తగ్గ తాయిళాలు పొందడానికే డాక్టర్లవుతారని ఒక ఉన్నతస్థాయి అధికారి అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భగ్గుమంది.

  • News18
  • Last Updated: January 11, 2021, 22:04 IST
  • Share this:
    సమాజంలో వైద్యులకు ప్రత్యేక స్థానం ఉంది. కనిపించని దేవుడి కంటే కనిపించే వైద్యుడినే దైవంగా భావిస్తాం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు.. మారుమూల పల్లెటూర్లు, పీహెచ్సీలలో ప్రాణాలకు తెగించి మరీ పలువురు వైద్యులు అందిస్తున్న సేవలు మరువరానివి. ఇక కోవిడ్-19 సందర్భంగా వైద్యుల అంకితాభావం, నిబద్దతను ఈ సమాజం చూసింది. అయితే ఇలా అందరు డాక్టర్లున్నారా..? అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. అయితే డాక్టర్లు మాత్రం.. సేవ చేయడానికి కాదు.. వారి స్టేటస్ పెంచుకుని అందుకు తగ్గ తాయిళాలు పొందడానికే డాక్టర్లవుతారని ఒక ఉన్నతస్థాయి అధికారి అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భగ్గుమంది. ఇంతకీ ఆయనేమన్నాడు..? ఐఎంఎ అభ్యంతరాలేమిటి..?

    జార్ఖండ్ కు చెందిన డాక్టర్ నితిన్ కులకర్ణి.. అక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ఆయన ఇటీవలే ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘డాక్టర్ అయితే ఏం పని ఉండదని కొంతమంది వైద్యులవుతారు. ఇంకొంతమందేమో.. తాము వైద్యులమైతే కట్నాలు ఎక్కవస్తాయని వైద్య విద్యను చదువుతారు..’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



    కాగా.. సదరు అధికారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జార్ఖండ్ డాక్టర్స్ అసోసియేషన్ భగ్గుమంది. తాము ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేస్తుంటే ఇటువంటి కామెంట్స్ చేయడం సమంజసం కాదని అన్నాయి. ఒక ఉన్నతస్థానంలో ఉన్న అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ ను లెక్కచేయకుండా పోరాటం చేస్తున్నది వైద్య సిబ్బందేనని.. ఈ పోరులో తమ సహోద్యోగులు సుమారు ఎనిమిది వందల మంది దాకా ప్రాణాలు అర్పించారని తెలిపారు. అయితే.. తన పై వస్తున్న ఆరోపణలపై నితిన్ కులకర్ణి మళ్లీ స్పందించలేదు. దీంతో ఈ వివాదం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) దగ్గరకు వెళ్లింది.

    ఇదే విషయమై ఐఎంఎ స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలు సమంజసం కాదని తెలిపింది. నిఖిల్ కులకర్ణి పై తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఐఎంఎ కోరింది. దీనిపై జార్ఖండ్ హెల్త్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి బన్న గుప్తా ను కలిసి వినతి పత్రం అందించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.
    Published by:Srinivas Munigala
    First published:January 11, 2021, 22:04 IST

    टॉप स्टोरीज