JEWELER RAKESH SURANA IN MADHYA PRADESH ON THE PATH OF RENUNCIATION DONATED PROPERTY WORTH 11 CRORES TO GAUSHALA PVN
Viral : రియల్ లైఫ్ శ్రీమంతుడు..కోట్ల రూపాయల ఆస్తి గోశాలకు విరాళం..భార్యా,కొడుకుతో కలిసి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి
ఫ్యామిలీతో రాకేష్ సురానా
Jeweler Donated Property worth 11 crores : పొద్దున లేచింది మొదలు చాలామంది దృష్టి అంతా డబ్బు సంపాదనపైనే ఉంటుంది. కొందరికి మాత్రం ఎంత సంపాదించినా తనివి తీరదు. ఇంకా ఇంకా సంపాదనవైపే మొగ్గుచూపుతుంటారు. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు
Jeweler Donated Property worth 11 crores : పొద్దున లేచింది మొదలు చాలామంది దృష్టి అంతా డబ్బు సంపాదనపైనే ఉంటుంది. కొందరికి మాత్రం ఎంత సంపాదించినా తనివి తీరదు. ఇంకా ఇంకా సంపాదనవైపే మొగ్గుచూపుతుంటారు. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అయితే అందరూ అలాగే ఉండరని ఓ నగల వ్యాపారి(Jeweler) కుటుంబం నిరూపించింది. నిత్యం డబ్బు, నగలతో సుఖమయ జీవితం గడుపుతున్న ఓ నగల వ్యాపారి కుటుంబం.. ప్రపంచిక సుఖాలను త్వజించి, ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఆ నగల వ్యాపారి కోట్ల రూపాయల తన,తన కుటుంబానికి చెందిన యావదాస్తులను ఓ గోశాలకు, ఇతర మత సంస్థలకు విరాళంగా(Donation) అందించారు. తన కుటుంబం మొత్తం అధ్యాత్మిక ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నదని ఆ నగల వ్యాపారి వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.
కోటీశ్వరులు తమ యావదాస్తిని దానం చేసి నిరాడంబర జీవితం గడిపే సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్(Madhyapradesh) బాలాఘాట్‌లో ఇలాంటి ఘటన నిజంగా జరిగింది. బాలాఘాట్‌లో చిన్నపాటి బంగారం, వెండి నగల దుకాణం ప్రారంభించిన రాకేష్ సురానా అనే వ్యక్తి.... వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధించి కోట్లకు పడగలెత్తారు. పేరు, కీర్తి రెండూ లభించాయి. ఆయనకు భార్య లీనా సురానా(36), కుమారుడు అమయ్ సురానా(11)ఉన్నారు. అయితే, కోట్లు సంపాదించినా జీవితంలో ఇంతకుమించినదేదో వెతుక్కోవాలని భావించాడు రాకేష్. భార్య, కొడుకుతో కలిసి ఆధ్యాత్మికత బాటలో పయనించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన యావదాస్తి(రూ.11కోట్లు)ని ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చారు. ఆధ్యాత్మిక గురువు గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేష్ సురానా తెలిపారు. ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా రాకేష్ సురానా మాట్లాడుతూ.."డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదు. మనమేంటి అని గుర్తించడమే జీవితం పరమార్థం. మానవుల కోరికలకు ఎప్పటికీ అంతం ఉండదు. మతం, ఆధ్యాత్మికత విలువల గురించి గురు మహేంద్ర సాగర్ మహరాజ్, మనీశ్ సాగర్ తో గడిపినప్పుడు తెలుసుకున్నా. నా భార్య కూడా చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకుంది. నా భార్య లీనా అమెరికాలో చదువుకుంది అలాగే, బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందింది. ఇక నా కుమారుడు అమయ్ సురానా కూడా నాలుగేళ్ల నుంచే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాడు. అమయ్ సురానా నాలుగు సంవత్సరాల వయసులో ఆధ్యాత్మికం గురించి మాట్లాడేవాడు"అని చెప్పారు. ఈ నెల 22న తమ కుటుంబం జైపూర్ లో సన్యాస దీక్ష స్వీకరించనున్నట్లు రాకేష్ సురానా తెలిపారు. ఇదిలా ఉండగా, 2017లో రాకేశ్ సురానా తల్లి కూడా దీక్ష చేపట్టి..ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టారు. కానీ క్యాన్సర్ వల్ల ఆ తర్వాత ఏడు రోజులకే ఆమె చనిపోయారు. వీరే కాకుండా లీనా సురానా సోదరి 2008లో దీక్ష చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.