ఫ్రీ ఫ్రీ ఫ్రీ... ఈ పోటీలో గెలిస్తే ఏడాది పాటు విమానాల్లో తిరగొచ్చు

ఈ పోటీలో గెలవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే.. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేయాలి.

news18-telugu
Updated: March 2, 2019, 4:45 PM IST
ఫ్రీ ఫ్రీ ఫ్రీ... ఈ పోటీలో గెలిస్తే ఏడాది పాటు విమానాల్లో తిరగొచ్చు
ప్రతీకాత్మక చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ scyther5/ Istock.com)
  • Share this:
ఈ పోటీలో గెలిస్తే మీరు విమానాల్లో హాయిగా తిరగొచ్చు. ఏడాది పాటు మీకు ఎలాంటి టికెట్ లేకుండా ఆ సంస్థ విమానాల్లో ఎంజాయ్ చేయొచ్చు. అయితే, అందుకోసం మీరు చిన్న పోటీలో గెలవాలి. జెట్ బ్లూ అనే విమానయాన సంస్థ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఈ పోటీలో గెలవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే.. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేయాలి. ఔను. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలన్నీ డిలీట్ చేసి.. మీరు ఫ్రీగా ప్రయాణం చేసే ఫొటోలు మాత్రం అందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

flight tickets, flights, jetblue, JetBlue Contest, jetblue flights, us flights, ఫ్లైట్ టికెట్లు, ఫ్లైట్స్, ఫ్లైట్ టికెట్ ఆఫర్లు, జెట్‌బ్లూ, ఫ్రీగా విమానం టికెట్లు, జెట్ బ్లూ కాంటెస్ట్, జెట్ బ్లూ ఫ్లైట్స్, అమెరికా ఫ్లైట్స్
ప్రతీకాత్మక చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ scyther5/ Istock.com)


అయితే, ఈ పోటీలో పాల్గొనేందుకు ఫొటోలు డిలీట్ చేయడం కంటే వాటిని తీసి దాచిపెట్టుకోవడం బెటర్. కొందరు అయితే, పాత ఫొటోలు తీసుకోవడం ఎందుకు? కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని కొందరు లాజిక్ తీస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారికి మార్చి 8 డెడ్‌లైన్. ఈ పోటీలో గెలిస్తే, 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జెట్‌బ్లూ విమానాల్లో ఫ్రీగా తిరిగిరావొచ్చు. అయితే, ఈ ఆఫర్ అమెరికాలో నివసించే వారికి మాత్రమే అనేది చిట్టచివరి కండిషన్.


First published: March 2, 2019, 4:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading