పాట్నా: బీహార్‌లో అధికారి పార్టీ ఎమ్మెల్యే ట్రైన్లో అండర్‌వేర్‌తో కనిపించడం కలకలం రేపింది. పాట్నా నుంచి ఢిల్లీ వెళుతున్న తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో జేడీయూ ఎమ్మెల్యే అండర్‌వేర్‌తో కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ కావడంతో ఈ ఎమ్మెల్యే ఎవరంటూ ఇంటర్నెట్లో చర్చ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో పాట్నా నుంచి ఢిల్లీ వెళుతున్నారు.
ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఆయన ప్రయాణిస్తున్నారు. అయితే.. ఆయన ట్రైన్లో అండర్‌వేర్‌తో కనిపించడంతో ఆ బోగీలోని తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకున్నంత పని చేశారు. ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం ఏదో ఇంట్లో మాదిరిగా అన్నీ విప్పుకుని అండర్వేర్ మీద తిరుగుతానంటే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే అసభ్యకర తీరుపై ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్‌కు ట్రైన్‌లోని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Sad Incident: ఈ అమ్మాయి పేరు పూజ... రూపానికి తగ్గ గుణం.. కానీ ఇలా జరగడం...
#WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq
— ANI (@ANI) September 3, 2021
ఈ ఘటనపై ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివరణ ఇచ్చారు. తాను బనియన్, అండర్వేర్లో ఉన్న మాట వాస్తవమేనని, ట్రైన్ ఎక్కిన తనకు కడుపు ఉబ్బరంగా అనిపించడంతో అలా బాత్రూమ్కు వెళ్లానని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. ఈలోపు ఈ ఘటనను అనవసరంగా వివాదం చేస్తున్నారనట్టుగా ఎమ్మెల్యే స్పందించారు.
అయితే.. ఎమ్మెల్యే అలా బహిరంగంగా బనియన్, అండర్‌వేర్‌తో కనిపించడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ట్రైన్లో వెళుతున్న వారంతా ఈ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకుంటే.. ట్రైన్లో జర్నీ చేసే మగాళ్లకు చొక్కా, ప్యాంట్లతో పని ఉండదని కొందరు వెటకారం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం.. ప్రయాణాల్లో కడుపు తిప్పినట్టుగా అనిపిస్తే బనియన్, అండర్‌వేర్‌తో తిరిగితే తగ్గిపోతుందన్న విషయం ఇన్నాళ్లూ తమకు తెలియదని.. ఇలాంటి ఉత్తమ వైద్య సలహాదారులు ఉండగా ఎంబీబీఎస్‌లు చదవడం ఇంకెందుకుని మరికొందరు ఎమ్మెల్యే వివరణను తూర్పారబడుతున్నారు. మనం ఇంతటి నాణ్యమైన మేలురకం నాయకులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నామని కొందరు ట్వీట్ చేశారు. ఏదేమైనా ఎమ్మెల్యే ఇలా కనిపించడం జేడీయూకు తలనొప్పిగా మారింది. జేడీయూలో ఎమ్మెల్యేలకు తెలివితేటలు ఈ రేంజ్లో ఉన్నాయంటూ ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.