హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: కొత్తగా.. సరికొత్తగా.. కొత్త పెళ్లి జంట.. జేసీబీలో ఇలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..

Viral Video: కొత్తగా.. సరికొత్తగా.. కొత్త పెళ్లి జంట.. జేసీబీలో ఇలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..

జేసీబీలో నూతన వధూవరులు

జేసీబీలో నూతన వధూవరులు

ఒక్కోసారి కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ట్రెండ్ క్రియేట్ చేస్తుంటాయి. వీడియోలో ఉన్న వ్యక్తులు కూడా పాపులరిటీ తెచ్చుకుంటారు. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలే వైరల్ వీడియోల రూపంలో వాట్సప్, ఫేస్ బుక్ లలో తెగ షేర్ అవుతుంటాయి. ఈ వీడియో కూడా అలా వైరల్ అయింది.

ఇంకా చదవండి ...

  ఒక్కోసారి కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ట్రెండ్ క్రియేట్ చేస్తుంటాయి. వీడియోలో ఉన్న వ్యక్తులు కూడా పాపులరిటీ తెచ్చుకుంటారు. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలే వైరల్ వీడియోల రూపంలో వాట్సప్, ఫేస్ బుక్ లలో తెగ షేర్ అవుతుంటాయి. నెటిజన్ల కామెంట్లతో నెట్టింట రచ్చనే క్రియేట్ చేస్తుంటాయి. అచ్చం అలాంటిది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

  Video Viral: అయ్యో.. ఎంత కష్టం వచ్చిందో నవ వధువుకు.. అత్తింటికి వెళ్లలేక ఆమె ఏం చేసిందో చూడండి..


  ఎవరికైనా జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే జరుగుతుంది. పెళ్లి తర్వాత ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకపోతే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగదు. ఆ బంధం కలకాలం సాగాలని.. వారి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలంటే కొన్ని అడ్వంచర్స్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వీడియోను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. వివరాల్లోకి వెళ్తే..  ఇటీవల పెళ్లి వేడుకల వద్ద వివిధ రకాల ప్రోగ్రామ్ లు జరుపుకుంటున్నారు. వాటిని వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

  Funny Incident: ఏ బ్రాండ్ మద్యం తాగావ్ నాయనా.. పోలీసులకే చుక్కలు చూపించావ్ గా..


  అందులో కొన్ని వైరల్ గా మారుతున్నాయి. ఆ వీడియోల్లో కొన్ని నవ్వులు తెప్పిస్తుంటే.. మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ మనం చెప్పుకునే వీడియో కూడా అలాంటిదే. అదేంటంటే.. పాకిస్థాన్ కు చెందిన ఓ జంట తన పెళ్లి పీటల మీదకు రావడానికి ఏకంగా జేసీబీలో ప్రయాణించి పెళ్లి వేదికపైకి వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ వివాహం గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేందుకు ఇలా ప్రయత్నిస్తుంటారు.

  Viral Photos: విచిత్రమైన ఫొటోలు.. మీరు చూస్తే కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు..


  వారు జేసీబీ మీద నుంచి వస్తుండటం.. ఆ దారి పొడవునా స్థానికులు వారికి చీర్స్‌ చెప్పారు. పెండ్లి వేదిక వద్ద జేసీబీ నుంచి కిందకు దిగిన వధువరులకు వారి బంధువులు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చి సందడి చేశారు. పాకిస్థాన్‌లోని హంజా లోయలో జరిగిన ఈ పెండ్లికి సంబంధించిన వీడియోను ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్‌ గులాం అబ్బాస్ తన ట్విట్టర్‌ ఖాతాలో పొస్ట్‌ చేశారు. పాకిస్థాన్ లోని ‘హంజా వ్యాలీలో అడ్వెంచర్స్ వెడ్డింగ్’ అని దీనికి సంబంధించి శీర్షకి కూడా పెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Trending news, Viral Videos

  ఉత్తమ కథలు