Jawed Habib: కోవిడ్ నేపథ్యంలో బహిరంగంగా ఉమ్మివేయడం శిక్షార్హమైన నేరం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
జావెద్ హబీబ్ (Jawed Habib Video).. ఇండియాలో పాపులర్ హెయిర్ స్టైలిస్ట్స్ (Hair Stylist)లో ఒకరు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈయన వద్ద హెయిర్ కట్ చేయించకుంటారు. ఐతే ఆయన తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. మహిళ తలపై ఉమ్మివేసి.. హెయిర్ కట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనవరి 3న యూపీలో ముజఫర్‌నగర్‌లో ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఆ వర్క్‌షాప్‌కు పలువురు సెలూన్ షాప్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ మహిళకు హెయిర్ కట్ చేసేందుకు పిలిచారు. ఆమె కుర్చీపై కూర్చోబెట్టి..హెయిర్ కట్ చేస్తూ.. అక్కడున్న వారికి హెయిర్ కట్ టిప్స్ వివరించారు.
జుట్టు కత్తిరించేటప్పుడు నీరు లేకుంటే.. ఉమ్మితోనే చేసేయాలి. ఉమ్మికి మంచి పవర్ ఉందంటూ.. ఆమె తలపై ఉమ్మివేశాడు జావెద్ హబీబ్. దానిని దువ్వెనెతో తలంతా చేసి.. హెయిర్ కట్ చేశాడు. చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఆమెకు జుట్టును కత్తిరించాడు. అతడు చేసిన పనికి అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ నవ్వుకున్నారు. ఆ తర్వాత సదరు మహిళ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది (Jawed habib spitting Video).
Jawed Habib’s spitting on the head has not gone down well. It’s unhygienic, unhealthy and puke worthy… pic.twitter.com/TPgkVEkCPM
జావెద్ హబీబ్ తన తలపై రెండు సార్లు ఉమ్మివేశాడని బాధిత మహిళ వాపోయింది. షాప్‌లో నీళ్లు లేకుంటే ఇలా కవర్ చేయవచ్చని సలహా ఇచ్చారని.. ఆయన తీరుతో తనకు ఏం చేయాలో అర్ధం కాలేదని తెలిపింది.
So this is what #JavedHabib spit fiasco is all about: Habib seems to be an arrogant man who, when asked some questions by Puja Gupta during his seminar, told her he runs 900 salons whereas she runs just 1. Then, to humiliate her further, he called her on stage & spit in her hair pic.twitter.com/V4l2fA6Vbu
జావెద్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఛీ..థూ..అంటూ విరుచుకుపడుతున్నారు. అటు సెలూన్ షాప్ నిర్వాహకులు కూడా జావెద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ వల్ల సెలూన్ షాపులు నిర్వహించే వారందరికీ చెడ్డ పేరు వస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు జావెద్ తీరుపై జాతీయ మహిళా కమిషన్ కూడా మండిపడింది. ఇప్పటికే ఆయనపై పలు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఈ వీడియో చూస్తుండగానే వైరల్ అయిపోయింది. ఆయన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈక్రమంలో దీనిపై ఎట్టకేలకే జావెద్ హబీబ్ స్పందించారు. తాను ఉద్దేశ్వపూర్వకంగా ఉమ్మి వేయలేదని, అక్కడున్న వారిని వినోదపరిచే క్రమంలో అలా జరిగిందని చెప్పారు. తాను చేసిన పనిపట్ల ఇబ్బంది కలిగి ఉంటే.. వారికి క్షమాపణ చెబుతున్నానని వీడియో పోస్ట్ చేశారు జావెద్ హబీబ్.
కాగా, హెయిర్‌స్టైలిస్ట్ జావేద్ హబీబ్ ఇండియాలోని 115 నగరాల్లో 850 కంటే ఎక్కువ సెలూన్లు, 65 హెయిర్ అకాడమీలను నిర్వహిస్తున్నారు. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో బహిరంగంగా ఉమ్మివేయడం శిక్షార్హమైన నేరం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.