Home /News /trending /

JARMANY SICK OF ROOSTERS REPEATED CROWING COUPLE TAKES LEGAL ACTION AGAINST OWNER PAH

ఇదేందిరా నాయన.. కోడి కూయడమే పాపమైంది.. ఇంటి యజమాని ఏంచేశాడంటే..

కూస్తున్న కోడిపుంజు

కూస్తున్న కోడిపుంజు

Viral news: కోడి అరుస్తుందని ఇంటి యజమాని చిరాకు పడ్డాడు. అంతే కాకుండా.. ఇంట్లో ఉన్నవారితో గొడవలకు దిగాడు. కోడి కూయడంతో తన ఆరోగ్యం పాడవుతుందని న్యాయపోరాటానికి సైతం వెళ్లాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India
మనలో చాలా మంది ప్రతి చిన్న విషయలకు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. ఒకరిపై కోపాన్ని మరోకరిపై తీస్తుంటారు. కొందరు నోరులేని జీవాలపై దాడులకు పాల్పడుతుంటారు. అంతే కాకుండా.. ఇప్పటికే అనేక మంది కుక్కలు, పిల్లులు, ఇతర జీవాలపై తమ ప్రతాపం చూపించిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, జర్మనీలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫ్రెడరిక్ ,జుట్టా , పశ్చిమ జర్మన్ లోని (Jarmany)  బాడ్ సాల్జుఫ్లెన్ లోని, పక్క ఇంటిలో ఒక కోడి ఉంది.

అది పదే పదే అరుస్తుంది. దీంతో అతను డిస్టర్బ్ అయ్యాడు. అంతేకాకుండా.. రోజంతా దాదాపు.. 100 నుంచి 200 ల వరకు కూస్తుందని అన్నాడు. దీంతో తన ఆరోగ్యం పాడవుతుందని ఫ్రెడరిక్, జుట్టా అన్నాడు. కోడి రాత్రంతా కూస్తునే ఉంటుందని ఫ్రెడ్రిచ్-విల్హెల్మ్ దంపతులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కోడి అరుపుల మీద ఆయన పోలీసుల వరకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ (Viral news) గా మారింది.



ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన జరిగింది.

లలిత్ పూర్ నియోజక వర్గానికి చెందిన సచిన్ సాహు అనే పొలిటిషియన్, అభయ్ నామ్ దేవ్ అనే 16 ఏళ్ల బాలుడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే.. అతను ఇంట్లో పనిచేస్తుండగా ఏదో పొరపాటు చేశారు. దీంతో సచిన్ సాహు రెచ్చిపోయాడు.

అభయ్ నామ్ దేవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతే కాకుండా.. కోపంతో అతని ముక్కును కసితీరా కొరికాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే.. బాలుడు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) లో తెగ చక్కర్లు కొడుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు