Video : 400 ఏళ్ల నాటి ఆలయానికి పూజారిగా రోబో...
Japan : రోబో టెక్నాలజీకి మారుపేరైన జపాన్... అన్ని రంగాల్లో వాటిని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా... ఓ ప్రాచీన ఆలయంలో రోబోను పూజారిగా నియమించింది. ఇప్పుడా ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగింది.

జపాన్ రోబో పూజారి (Image : Youtube - DW News)
- News18 Telugu
- Last Updated: August 16, 2019, 10:17 AM IST
జపనీయులకు బుద్ధిజం అంటే ప్రాణం. దాన్ని కాపాడుకునేందుకు వాళ్లు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. తాజాగా జపాన్... క్యోటోలోని 400 ఏళ్ల ప్రాచీన కొడాయ్‌జీ ఆలయానికి పూజారిగా ఓ రోబోను నియమించారు. అది ఎంత గొప్ప రోబో అంటే... దానికి బుద్ధిజానికి సంబంధించిన సమగ్ర సమాచారమూ తెలుసు. అన్ని రకాల పూజలూ తెలుసు. భక్తులు రాగానే గౌరవ వందనం చేస్తూ... ఆలయానికి ఆహ్వానిస్తుంది. తర్వాత వారి ముందు కొన్ని మంత్రాలు చదువుతుంది. వారితో కొన్ని పూజలు చేయిస్తుంది. తర్వాత... వారికి కొన్ని గౌతమ బుద్ధుడి జ్ఞాన బోధలు చేస్తుంది. ఈ కొత్త రోబోకి మరో గొప్ప లక్షణం కూడా ఉంది. ఇది ఏరోజు కారోజు... కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ... వాటిని కూడా తన మెమరీ పవర్లోకి ఎక్కించేసుకోగలదు. అందువల్ల దీని నాలెడ్జి అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందన్నమాట. మతాచారాలను ఇది కొత్త పుంతలు తొక్కిస్తుందని మెచ్చుకుంటున్నారు చాలా మంది.
ఈ రోబోను విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. ఇది ఫ్రాంకెన్‌స్టెయిన్ (పాత కెమెరాల సృష్టికర్త)కి అమ్మలా ఉందని విమర్శించారు కొందరు. ఆలయ పూజారులు మాత్రం విమర్శల్ని కొట్టిపారేశారు. కాలానుగుణంగా మార్పులు రావాల్సిందే అన్నారు. మనుషుల కంటే ఎక్కువ నాలెడ్జితో ఉన్న ఈ రోబో... పరిస్థితులకు తగ్గట్టుగా మంచి మాటలు చెప్పి... కష్టాలు, బాధల్లో ఉన్నవారికి ఓదార్పు ఇస్తుందనీ, అవతలి వాళ్లు ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో గ్రహించి... అందుకు తగ్గట్టుగా... మనసు కుదుటపడేలా మాట్లాడుతుందని చెబుతున్నారు. మనిషిలాగే ఓదార్చుతూ... తల, చేతులూ, నడుం కదుపుతూ... హావభావాలు పలికిస్తుండటం వల్ల... తమకు కాస్త ఉపశమనం లభించినట్లుగా భక్తులు భావిస్తారని తోటి పూజారులు చెబుతున్నారు.ఈ రోబో ఎడమ కంట్లో... ఓ వీడియో కెమెరాను సెట్ చేశారు. జపాన్‌లోని జెన్ ఆలయం, ప్రముఖ రోబోటిక్స్ ప్రొఫెసర్ హిరోషీ ఇషిగురో కలిసి... ఒసాకా యూనివర్శిటీలో ఈ రూ.7 కోట్ల ప్రాజెక్టును చేపట్టారు. మిందార్ అని పిలిచే ఈ రోబో ఇప్పుడు కొడాయ్‌జీ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పార్లమెంటులో అందరూ చూస్తుండగానే పెళ్లి ప్రపోజల్ పెట్టిన ఎంపీ...ఇటలీలో ఘటన
అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా షింజో అబె రికార్డు...
అణుబాంబుల కోసం వెచ్చించే డబ్బుతో...పేదరికం నిర్మూలించండి...పోప్ పిలుపు
వీకీలీక్స్ అసాంజే ఆరోగ్య పరిస్థితి విషమం...జైలులో చనిపోయే ప్రమాదం...
పురుగులతో బిర్యానీ వండుకుంటే యమ రుచి...ఓ మంత్రిగారి ఉచిత సలహా...
హాంకాంగ్‌లో దారుణం...అందరూ చూస్తుండగానే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పటించిన దుండగులు
Loading...