ఆ బామ్మకు 117 ఏళ్లు... వరల్డ్ రికార్డు బ్రేక్...

World's Oldest Person : ఇలాంటి రికార్డులు బద్ధలవ్వాలంటే... జపాన్‌కే సాధ్యమేమో అనిపించకమానదు. ఆ దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగిపోతోంది.

news18-telugu
Updated: January 6, 2020, 8:49 AM IST
ఆ బామ్మకు 117 ఏళ్లు... వరల్డ్ రికార్డు బ్రేక్...
ఈ బామ్మకు 117 ఏళ్లు... వరల్డ్ రికార్డు బ్రేక్... (credit - Reuters))
  • Share this:
World's Oldest Person : కానె తనక (Kane Tanaka)... తన ప్రపంచ రికార్డు తానే బద్ధలు కొట్టుకుంది. ఇప్పుడీ బామ్మ 117వ బర్త్‌డే జరుపుకుంది. జపాన్‌... ఫుక్వోకాలోని... ఓ నర్సింగ్ హోంలో ఈ వేడుక జరిగింది. పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన పార్టీకి కుటుంబ సభ్యులతోపాటూ... స్నేహితులు, బంధువులు వచ్చారు. నిజానికి తనక పుట్టిన రోజు జనవరి 2న. అందరికీ సెలవు దినం అని... ఆదివారం ఆ వేడుకను జరిపారు. ఇదంతా అక్కడి స్థానిక టీవీల్లో చూపించారు. బర్త్ డే కేక్ కట్ చేసి... చిన్న ముక్క తిన్న కానె తనక... టేస్టీగా ఉంది... మరికొంచెం కావాలి అంది. తనకాకు గతేడాది... 116 ఏళ్ల... 66 రోజులు నిండినప్పుడు... మార్చి 9న గిన్నీస్ బుక్ వారు... ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత ఎక్కువ వయసు మహిళగా ఆమెకు గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడు 117 ఏళ్లతో తన రికార్డును తనే బ్రేక్ చేసుకొని... కొత్త రికార్డ్ నెలకొల్పారు. 1903లో పుట్టిన తనకా... 1922లో హిడియోను పెళ్లి చేసుకుంది. వాళ్లకు నలుగురు పిల్లలు. మరొకరిని దత్తత తీసుకున్నారు.

జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతోందనేందుకు తనక ఓ ఉదాహరణ. ఆ దేశంలో ఇప్పుడు యువకుల కంటే ముసలి వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వృద్ధి ఏటా తగ్గుతోంది. జపాన్‌లో కొత్తగా పుడుతున్న పిల్లల సంఖ్య గతేడాది 5.9 శాతం తగ్గిపోయింది. ఏటా ఇదే సమస్య. పిల్లల్ని కనే వారి సంఖ్య తగ్గిపోతోంది. జపాన్‌లో ఆరోగ్య పరమైన జాగ్రత్తలు ఎక్కువ. హాస్పిటల్స్‌లో వైద్య సదుపాయాలకు కొరతే లేదు. అందువల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణ రేటు పెరుగుతోంది.
First published: January 6, 2020, 8:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading