Home /News /trending /

JAPANESE MAN SPENDS RS 12 LAKHS RUPEES TO BECOME A DOG KNOW HOW IS THIS POSSIBLE HERE IS INTERESTING STORY SK

OMG: ఇదేంటో తెలుసా? 100శాతం మంది ఫెయిల్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు

కుక్క రూపంలో టోకో

కుక్క రూపంలో టోకో

ఇక్కడ కనిపిస్తున్నది ఏంటో తెలుసా? చాలాా ఈజీ అని అనుకుంటారు. కానీ 100శాతం మంది ఫెయిలవుతారు. మరి అదెంటో ఇక్కడ తెలుసుకుందాం.

  ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా? అంత క్లియర్‌గా కనిపిస్తోందిగా.. అది కుక్క అని చాలా మంది ఈజీగా చెప్పేస్తారు. కానీ అది నిజం కాదు. కుక్క కాకపోతే.. కుక్క బొమ్మ అని సమాధానం చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ అది కూడా వాస్తవం కాదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కుక్క కాదు.. కుక్క బొమ్మ అంత కన్నా కాదు. మరేంటో తెలుసా..? మనిషి. అవును మీరు చదివిది నిజమే.. అక్కడున్నది ఓ మనిషే..! కానీ కుక్క రూపంలోకి మారిపోయిన మనిషి..! ఏంటి మనిషి.. కుక్కలా మారిపోయాడా? ఇదెలా సాధ్యం..? అని నోరెళ్లబెట్టకండి. అసలు ఆ వ్యక్తి కుక్కలా ఎలా మారాడో.. ఎందుకు మారాల్సి వచ్చిందో.. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  సాధారణంగా మనలో చాలా మందికి కుక్కలంటే ఇష్టం. ఎంతో ఇష్టంగా ఇంట్లో కుక్కలను పెంచుకుంటాం. సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటా. దాని తిండి, ఆరోగ్యం.. ఇలా అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటాం. దానిని బాగోగులకు ఎంత ఖర్చైనా వెనకాడం. అంతలా కుక్కలను ప్రేమిస్తాం. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి కూడా కుక్కలంటే ఇష్టం. కానీ అందరిలా కాదు. ఏకంగా కుక్కలా మారిపోయేంతలా ఇష్టం. తాను కుక్కలా మారిపోవాలన్నది 'టోకో' కలనట. అందుకే ఎంతో ప్రయత్నించి.. ఎంతో ఖర్చు పెట్టి.. కుక్కలా మారిపోయాడు. ఇందుకోసం ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు చేశాడు. ఇంతకు ఇదెలా సాధ్యమైందో తెలుసా..?

  OMG: ఇంత పొడవైన అరటి పండ్లను మీరెప్పుడూ చూసి ఉండరు.. అచ్చం సొరకాయల్లా..

  న్యూస్.మైని వార్తా ఏజెన్సీ కథనం ప్రకారం... జపాన్‌ (Japan)లో జెప్పెట్ (Zeppet) అనే ప్రొఫెషనల్ కాస్ట్యూమ్ ఏజెన్సీ ఉంది. పలు సినిమాలు, టీవీ షోలు, వినోదాత్మక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్‌, మస్కట్ పాత్రల దుస్తులను జెప్పెట్ సంస్థ తయారు చేస్తుంది. అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తోంది. తన కోరికను జెప్పెట్ నెరవేర్చగలదని భావించి. ఓ సారి వెళ్లి సంస్థ ప్రతినిధులను కలిశాడు టోకో. తాను కోలి జాతి కుక్కలా మారాలనుకుంటున్నానని.. తనను అచ్చం అలాగే రెడీ చేయాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు ఎంత ఖర్చైనా పరవా లేదు. తాను ఇస్తానని చెప్పాడు. అసలు ఇలాంటి ఆర్డర్ రావడం జెప్పెట్‌కు ఇదే తొలిసారి. ఒక మనిషిని జంతువులా ముస్తాబు చేయడం ఇంత వరకు ఎప్పుడూ చేయలేదు. అయినా సరే.. డీల్‌కు ఒప్పుకొని.. వెంటనే పనిని ప్రారంభిచింది.

  జెప్పెట్ సంస్థ ఆర్టిస్ట్‌లు ఎంతో కష్టపడి ‘కోలీ’ జాతీ కుక్క కాస్ట్యూమ్‌ (Dog Costume)ను రూపొందించారు. ఇందుకోసం వారికి 40 రోజుల సమయం పట్టింది. ఆ కాస్ట్యూమ్‌ని ధరించిన టోకో.. అచ్చం కుక్కలా మారిపోయాడు.


  ఎవరైనా చూస్తే.. నిజమైన కుక్కే అనుకుంటారు. కాస్ట్యూమ్ అంత అద్భుతంగా ఉంది. అంతేకాదు సేమ్ టూ సేమ్ కుక్కలాగే ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇస్తున్నాడు. కుక్క ఎలా ప్రవర్తిస్తుందో.. ఎలా నడుస్తుందో.. అలాగే చేసేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

  Video : షాకింగ్.. కూల్ డ్రింక్ లో బల్లి..మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌ లెట్‌ సీజ్  టోకో వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వావ్..నిజంగా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. కానీ కుక్క గెటప్ కోసం మరీ 12 లక్షలు ఖర్చుపెట్టాలా? అని కొందరు విమర్శిస్తున్నారు. ఎవరిష్టం వారిది.. చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి ఎంతైనా ఖర్చుపెట్టవచ్చని మరికొందరు అతడి బాసటగా నిలుస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: International, International news, Japan, Trending

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు