Home /News /trending /

JAPAN SCHOOL GETS RS 20 LAKH WATER BILL AFTER TEACHER LEAVES TAP ON FOR MONTHS PAH

Shocking: కొంప ముంచిన టీచర్ మాస్టర్ ప్లాన్.. స్కూల్ లో ఆ పనిచేసినందుకు అధికారులు సీరియస్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Japan: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా మహామ్మారి మరోసారి విలయ తాండవం చేస్తుంది. జపాన్ లోని ఒక టీచర్ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చేసిన పని ప్రస్తుతం తనకే ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

    Japan School Gets Rs 20 Lakh Water Bill:  ప్రపంచంలో కరోనా (Corona virus) కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే దీని ప్రభావం వలన పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు (Economic system ) కుదేలయ్యాయి. ఇక ఇప్పుడిప్పుడే పలు దేశాలు కోలుకుంటున్న తరుణంలో, మరోసారి కరోనా కేసులు (Corona Restrictions)  పెరుగుతున్నాయి. కరోనా కేసులు సంఖ్య పెరుతుండటంతో ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్, కరోనా ఆంక్షలు పాటిస్తున్నాయి. కరోనా తొలికేసు నమోదైన చైనా మరోసారి కరోనా కొత్తకేసులతో ఉక్కిరిబిక్కిరౌతుంది. అక్కడ లాక్ డౌన్ నిబంధనలను (Lock down) కఠినంగా పాటిస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే మరికొన్ని దేశాలు.. లాక్ డౌన్ నిబంధనలు, మాస్క్ నిబంధనలను మరోసారి అమలులోకి తెస్తున్నాయి. అయితే, జపాన్ లోని ఒక టీచర్ కరోనాను నియంత్రించడానికి చేసిన పని ప్రస్తుతం తనకే.. తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

    పూర్తి వివరలు.. జపాన్ లోని (Japan School) కనగావా ప్రిఫెక్చర్ లోని యోకోసుకాలోని పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్థానిక పాఠశాలలో ఒక ట్యాంక్ తో పాఠశాలకు తాగే నీళ్లను సరఫరా చేస్తారు. ఈ క్రమంలో.. గతంలో పాఠశాలలో.. కరోనా కేసులు అత్యధికంగా వెలుగు చూడటంతో స్కూల్ లో కొవిడ్ నిబంధనలను, కఠినంగా అమలు చేస్తున్నారు. అప్పుడు.. ఒక టీచర్ పాఠశాలలోని వాటర్ ట్యాప్ లను ఎప్పుడు ఆన్ లోనే ఉండేటట్లు చేశారు. కొన్ని నెలల పాటు కరోనా కేసుల కారణంగా పాఠశాలకు సెలవులు ఇచ్చేశారు. దీంతో.. సదరు టీచర్ ట్యాప్ లను ఆన్ లోనే ఉండేలా చేశారు. నీరు తాజాగా, నిరంతరం ఫ్లోటింగ్ ఉంటే.. కరోనా  వైరస్ వాటితో  సోకదని, నీళ్లు ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుందని సదరు టీచర్ భావించారు.

    పాఠశాలలోని ట్యాప్ లు ఆన్ లోనే ఉండటం వలన.. ట్యాంక్ లోని నీళ్లు ప్రతి రోజు వృథా అయిపోయాయి. ఈ విధంగా దాదాపు నెలలు కొనసాగింది. దాదాపు... 4 వేల టన్నుల నీళ్లు వెస్ట్ గా పోయాయి. ఈ నీటితో దాదాపు.. ట్యాంక్ ను 11 సార్లు ఫిల్ చేయవచ్చు. ఈ క్రమంలో స్థానికులు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి ఘటనపై ఆరాతీశారు. పాఠశాలలోని టీచర్, ఇద్దరు సూపర్ వైజర్లు దీనికి కారణమని గుర్తించారు.

    దీంతో పాఠశాలకు రూ. 20 లక్షల బిల్లు వచ్చిపడింది. స్థానిక అధికారులు బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇలా చేశారని విచారణలో తెలింది. అయితే, ఈ బిల్లులో సగం.. చెల్లించాల్సిందే అంటూ స్థానిక అధికారులు పట్టుపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Paresh Inamdar
    First published:

    Tags: Covid -19 pandemic, Japan, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు