Home /News /trending /

JAMMU KASHMIR SOLDIERS BODY FOUND 38 YEARS AFTER HE WENT MISSING IN SIACHEN PAH

సియాచిన్‌ మంచుతుఫాన్‌లో షాకింగ్ ఘటన.. 38 ఏళ్లకు లభ్యమైన జవాన్ మృతదేహం

జవాన్ ఫోటోతో కుటుంబ సభ్యులు

జవాన్ ఫోటోతో కుటుంబ సభ్యులు

Jammu kashmir: దేశం కోసం అత్యంత ఎత్తైన సియాచిన్ మంచు ప్రాంతంలో ఒక జవాన్ 38 ఏళ్ల క్రితం కన్పించకుండా పోయాడు. అతని కోసం ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jammu and Kashmir, India
మన దేశంలో దాయాది దేశాలు, శత్రుదేశాలు ప్రవేశించకుండా ఉండటానికి భారత సైనికులు అత్యంత ఎత్తైన ప్రాంతమైన సియాచిన్ మంచు ప్రాంతంలో ఎల్లప్పుడు పహారా కాస్తున్నారు. అయితే.. మనదేశం , ఆపరేషన్ మేఘదూత్ లో భాగంగా.. 1984 లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం సియాచిన్ లో భారత సైనికులు, కాపాలా కాశారు. ఈ క్రమంలో.. దాదాపు.. 20 మంది వరకు కాపాలాగా ఉన్నారు. అప్పుడు అక్కడ మంచుతుపాను సంభవించింది. ఆ తర్వాత.. అందరు తలోచోట పడిపోయారు. దీంతో గల్లంతైన  సైనికుల కోసం ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో..  దాదాపు 15 మంది జవాన్లు మృతదేహాలు లభించాయి. కానీ మరో 5 గురి డెడ్ బాడీలు ఇంకా లభ్యం కాలేదు. అయితే.. తాజాగా, ఆ రోజు కన్పించకుండా పోయిన జవాన్ మృతదేహం లభించింది.

ఆర్మీ అధికారుల ప్రకారం.. రానిఖేత్‌లో ఉన్న సైనిక్ గ్రూప్ సెంటర్ ఆదివారం ఈ డెడ్ బాడీని గుర్తించింది. 19 కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ హర్బొలాగా గా గుర్తించారు. ఇతని భార్య.. శాంతిదేవీ అల్మోరా కు చెందిన మహిళ. కానీ, ప్రస్తుతం హల్ద్వానిలోని, సరస్వతి విహార్ కాలనీలో ఆమె నివసిస్తున్నారు. చంద్రశేఖర్  డెడ్ బాడీని సోమవారం సాయంత్రానికల్లా అతని గ్రామానికి చేరవేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా స్థానిక అధికారులు పెద్ద ఎత్తున హల్ద్వాని గ్రామానికి చేరుకున్నారు.సబ్ కలెక్టర్ మనీష్ కుమార్, తహశీల్దార్ సంజయ్ కుమార్‌లు హర్బొలా ఇంటికి వెళ్లారు. మిలిటరీ గౌరవాలతోనే హర్బొలా అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, శాంతి దేవి, చంద్రశేఖర్ హర్బొలా పెళ్లి చేసుకుని 9 ఏళ్లు కలిసి ఉన్నారని తెలిపారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు అని శాంతి దేవి తెలిపారు. హర్బొలా చివరి సారి 1984 జనవరిలో ఇంటికి వచ్చారని వివరించారు.

ఆ సమయంలోనే తాను త్వరలోనే తిరిగి ఇంటికి వస్తానని తనకు వాగ్దానం చేశాడని ఆమె తెలిపింది. కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టకున్నా.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తన భర్త గొప్పవాడని వివరించింది. హర్బొలాతోపాటు మరో జవాను మృతదేహం కూడా లభించినట్టు తెలిసింది. అయితే, ఆ మృతదేహాన్ని ఇంకా గుర్తించవలసి ఉందని పేర్కొన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Jammu and Kashmir, VIRAL NEWS

తదుపరి వార్తలు