JAMMU KASHMIR AMARNATH PILGRIM CRITICAL AFTER FALLING 100 FEET AIRLIFTED BY ARMY PAH
అమర్ నాథ్ యాత్రలో విషాదం.. కొండ నుంచి 100 అడుగుల కిందకు పడిపోయిన యాత్రికుడు..
సహయక చర్యలు చేపట్టిన ఆర్మీ సిబ్బంది
Jammu kashmir: అమర్ నాథ్ యాత్ర చేయడానికి వచ్చిన భక్తుడు అనుకొని ప్రమాదంలో పడ్డాడు. సత్యనారయణ తోష్నేయ అనే యాత్రికుడు 100 అడుగుల ఎత్తైన ప్రదేశం నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు .
కరోనా మహమ్మారి (covid) కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమర్ నాథ్ (amarnath yatra) యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే... వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరోసారి యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు అమర్ నాథ్ మంచు శివలేంగేశ్వరుడిని దర్శించుకొవడానికి పొటేత్తారు. ఈ నేపథ్యంలో సోమవారం అనుకొని ఘటన జరిగింది. మహారాష్ట్రలోని అకోలాకు సత్యనారయణ తోష్నేయ అనే యాత్రికుడు.. జమ్మూ & కాశ్మీర్‌లోని (Jammu kashmir) బ్రరీమార్గ్ హెలిప్యాడ్ నుండి 50 ఏళ్ల అమర్నాథ్ యాత్రికుడు బ్యాలెన్స్ కోల్పోవడంతో 100 అడుగుల ఎత్తునుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అతడిని ప్రత్యేక విమానంలో శ్రీనగర్ తరలించారు. అతను పోనీపై కూతురు, భార్యతో కలిసి దర్శనం తర్వాత పవిత్ర గుహ నుండి తిరిగి వస్తున్నాడు. బ్రరీమార్గ్ సమీపంలో, పోనీ అసమతుల్యత చెందింది. దీంతో వ్యక్తి నదికి దాదాపు 100 అడుగుల దూరంలో పడిపోయాడని ఆర్మీ అధికారులు తెలిపారు.
సత్యనారయణ తోష్నేయ తలకు, ఛాతీలో తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు గుర్తించారు. వెంటనే.. ఆర్మీ దళాలు, మొబైల్ రెస్క్యూ టీమ్‌తో పాటు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని బరారీమార్గ్ ఆర్మీ మెడికల్ ఎయిడ్ పోస్ట్‌కు తరలించారు. స్థానికంగా అతనికి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత.. వెంటనే హెలికాప్టర్‌ను పిలిపించి, బరారిమార్గ్ హెలిప్యాడ్ నుంచి శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన జరిగింది.
ఒక మహిళ జోర్ బాగ్ స్టేషన్ లో ఉన్న రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకుంది. రైలు కోసం వేచిచూస్తుంది. అక్కడ 50 ఏళ్ల మహిళ కూడా ఉంది. రైలు ప్లాట్ ఫామ్ మీదకు వస్తుంది. ఇంతలో మహిళ అందరు చూస్తుండగానే రైలు ముందుకు దూకేసింది. దీంతో ఆమె రైలు కింద (Suicide) పడింది. అక్కడున్న వారు ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు.
వెంటనే రైలును ఆపారు. ఆమెను అక్కడినుంచి బైటకు తీశారు. వెంటనే రైల్వే సిబ్బంది..ఆమెను.. ఢిల్లీలోని సప్థర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది. ఆమె శవాన్ని మార్చూరీలో ఉంచారు. యువతి సూసైడ్ చేసుకొవడానికి గల కారణలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.