హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Female Auto Driver: కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన యువతి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ.. ఎక్కడంటే?

Female Auto Driver: కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన యువతి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ.. ఎక్కడంటే?

(Photo: ANI)

(Photo: ANI)

కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాల్లో నష్టం రావడంతో అనేక మందికి కుటుంబ పోషణ భారంగా మారింది.

కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాల్లో నష్టం రావడంతో అనేక మందికి కుటుంబ పోషణ భారంగా మారింది. జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir)లోని ఉధంపూర్(Udhampur) జిల్లాలోని ఒక కుటుంబంలో కూడా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోవడంతో.. అతని కూతురు ఆటోడ్రైవర్(Auto Driver)గా మారి కుటుంబానికి అండగా నిలుస్తోంది. పురుషులతో సమానంగా పోటీపడుతూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెబుతుంది. తద్వారా అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్ము కాశ్మీర్కు చెందిన 21 ఏళ్ల జంజీత్ కౌర్(Banjeet Kaur) అనే యువతి స్థానికంగా విద్యనభ్యసిస్తోంది. అయితే, లాక్డౌన్ కారణంగా తన తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్‌గా ఆటో నడుపుతోంది.

అసలు తను ఆటో డ్రైవర్గా మారడానికి కారణాన్ని వివరిస్తూ.. ‘‘మా నాన్న ఒక స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కానీ కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి పాఠశాలలు మూసివేసియడంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో, కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఆటోరిక్షా(Auto-Rickshaw) తోలడం మొదలు పెట్టాడు. కానీ, ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదు.. తద్వారా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. అందువల్ల, కుటుంబానికి అండగా ఉండటానికి నేనూ కూడా ఆటో నడపాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నా విద్య కొనసాగిస్తూనే పార్ట్ టైమ్‌గా ఆటో తోలుతున్నాను. దీని ద్వారా నాన్నకు కొంచమైనా సహాయపడగలనని నా అభిప్రాయం. మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.” అంటూ చెప్పుకొచ్చింది. కాగా, ఆటో రిక్షాను నడపడం ద్వారా ఆమె తన కుటుంబానికి సహాయం చేస్తూనే బంజీత్ కౌర్ తన చదువును కూడా కొనసాగిస్తోంది. భవిష్యత్తులో రక్షణ దళాలలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాట్లు తెలిపింది.

మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని నిరూపిస్తూ..

తన కూతురు తీసుకున్న నిర్ణయంపై సర్దార్ గోరఖ్ సింగ్(Sardar Gorakh Singh) మాట్లాడుతూ “తన కూతురు (Daughter) పట్ల గర్వంగా ఉంది. అమ్మాయిలు ప్రతి రంగంలో రాణించగలరని, తమ ఇష్టాన్ని బట్టి వృత్తిని ఎంచుకోవచ్చని నా కూతురు నిరూపించింది. కరోనా కారణంగా నా ఉద్యోగం కోల్పోవడంతో, కుటుంబానికి అండగా ఉండటానికి నా కూతురు ఈ నిర్ణయం తీసుకుంది. నేనే ఉద్యోగం కోల్పోగానే, ఆటో రిక్షాను ఎలా నడపాలో నేర్పించమని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషించాను." అని అన్నారు. ఇక కుటుంబానికి చేదుడుగా నిలుస్తోన్న బంజీత్పై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై ఉధంపూర్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ARTO) రాచనా శర్మ(Rachana Sharma) మాట్లాడుతూ ‘‘తండ్రికి మద్దతుగా ఆటో-రిక్షా నడుపుతున్న బంజీత్ కౌర్ వంటి అమ్మాయిలు సమాజానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆమె మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది." అని పేర్కొన్నారు.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Coronavirus, Jammu and Kashmir

ఉత్తమ కథలు