ప్రపంచ సుందరిగా టోనీ ఆన్న్ సింగ్... భారత యువతికి మూడో స్థానం

Miss World 2019 : ఈ ఏడాది ప్రపంచ సుందరిగా జమైకాకు చెందిన టోనీ ఆన్న్ సింగ్ కిరీటాన్ని దక్కించుకుంది. 69వ ప్రపంచ సుందరిగా ఆమె నిలిచింది. భారత్‌కు చెందిన సుమన్ రావ్ మూడో స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: December 15, 2019, 6:32 AM IST
ప్రపంచ సుందరిగా టోనీ ఆన్న్ సింగ్... భారత యువతికి మూడో స్థానం
టోనీ ఆన్న్ సింగ్ (credit - insta - missworld)
  • Share this:
Miss World 2019 : ఇటీవల విశ్వ సుందరి కిరీటాన్ని దక్షిణాఫ్రికా మహిళ జోజిబిని తుంజీ గెలవగా... ఇప్పుడు ప్రపంచ సుందరి కిరీటాన్ని కరీబియన్ దేశం జమైకాకు చెందిన యువతి టోనీ ఆన్న్ సింగ్ దక్కించుకుంది. లండన్‌లో జరిగిన ఫైనల్స్‌లో ఆమె... జడ్జిలు అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పింది. మీకే ఈ కిరీటాన్ని ఎందుకు ఇవ్వాలి అని అడిగితే... ఈ ప్రపంచాన్ని మార్చేందుకు ముందుకు సాగుతున్న మహిళల తరం ఉన్న దేశం నుంచీ తాను వచ్చానన్న టోనీ సింగ్... ఆ మహిళల్లోనే తానూ ఉన్నానని తెలిపింది. మీ జీవితంలో మిమ్మల్ని బాగా ఇన్‌పైర్ చేసిన మహిళ ఎవరు అని అడిగితే... నా తల్లి అని చెప్పడంతో... జడ్జిలు సంతృప్తి చెందారు. ఆమెను ప్రపంచ సుందరిగా ప్రకటించారు.


ఈ పోటీల్లో ఫ్రాన్స్‌కి చెందిన ఓఫెలీ మెజినో... ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా... భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ యువతి సుమన్ రావు మూడోస్థానంలో నిలిచింది. 1993లో లిసా హన్నా... జమైకా నుంచీ ప్రపంచ సుందరి టైటిల్ దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ దేశం నుంచీ కిరీటాన్ని అందుకున్న మహిళ 23 ఏళ్ల టోనీ ఆన్న్ సింగే. స్వతహాగా సింగరైన సింగ్... జమైకా నుంచీ మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా చరిత్ర సృష్టించారు.
 
View this post on Instagram
 

And Miss World 2019 is Toni-Ann Singh from JAMAICA ?? 1st Runner up: France ?? 2nd Runner up: India ?? #missworld2019


A post shared by Miss World (@missworld) on

 

Pics : అందాల వల విసురుతున్న షిరిన్ కంచవాలా
ఇవి కూడా చదవండి :

 

IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్

ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?

Health : ఒరెగానో వాడుతున్నారా... కిచెన్‌లో ఇది ఉంటే ఆరోగ్యమే

Health : అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు